దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక పార్టీలు పుట్టుకొస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఒక పార్టీ పెట్టగానే దానికి గుర్తింపు రాదు. ఒక పార్టీకి గుర్తింపు రావాలి అంటే ఆ పార్టీ మొదట ఎలక్షన్లలో పోటీ చేయాలి. ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఆ పార్టీకి ఎన్నికలలో ఆరు శాతం కంటే ఎక్కువ శాతం ఓట్లు రావాలి. అలా రానట్లైనా కూడా కనీసం కొన్ని అసెంబ్లీ స్థానాలలో గెలుపొందాలి. అలా గెలుపొందినట్లయితే ఆ పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తిస్తూ ఉంటుంది.

ఇక ఏదైనా పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ ఎన్నికలలో పోటీ చేయనంత వరకు , అలాగే కనీస శాతం ఓట్లు రాకపోయినా , కనీస శాతం స్థానాల్లో గెలవకపోయినా ఆ పార్టీకి గుర్తింపు ఉండదు. ఇకపోతే తమిళ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా టీ వీ కే అనే పార్టీని స్థాపించిన విషయం మన అందరికి తెలిసిందే. తాజాగా తలపతి విజయ్ ఓ రోడ్ షో ను నిర్వహించాడు. ఆ రోడ్ షో కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దానితో కొంత మంది విజయ్ స్థాపించిన టీ వీ కే పార్టీ గుర్తింపును రద్దు చేయాలి అని కోరగా ఎలక్షన్ కమిషన్ అసలు ఆ పార్టీ కొత్తగా స్థాపించబడింది. ఇప్పటివరకు ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ పార్టీకి ఇప్పటివరకు అసలు గుర్తింపే లేదు.

అలాంటి పార్టీ గుర్తింపును ఎలా రద్దు చేయగలం అనే విధంగా అడుగులు ముందుకు పడ్డట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ ప్రస్తుతం ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు రాజకీయాలపై కూడా చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టాడు. మరి ఈ సారి తమిళనాడు లో జరిగే ఎన్నికల్లో టీ వీ కే పార్టీ బరిలోకి దిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఆ ఎన్నికల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: