ఏపీలో పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై పోలీసుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. “ఏపీ పోలీసులు దేశానికే బ్రాండ్ .. కానీ ఇప్పుడు కొత్త చాలెంజ్ టైమ్ మొదలైంది” అంటూ బాబు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీ పెరిగిన ఈ యుగంలో “ఇంటెలిజెంట్ క్రైమ్స్” అనే పదం వాడడం విశేషం. “ఇప్పటి నేరస్తులు పాత పద్ధతుల్లో ఉండరు. ఎక్కడో కూర్చుని సైబర్ ప్రపంచంలో నేరం చేస్తారు. అలాంటప్పుడు పోలీసులు కూడా టెక్నాలజీతో రేస్‌లో ముందుండాలి” అని ఆయన స్పష్టం చేశారు. నేరస్తుల కంటే పోలీసులు ఒక అడుగు ముందుండాలి, అప్పుడు మాత్రమే కొత్త రకం నేరాలను అరికట్టగలమని బాబు చెప్పారు.

అయితే బాబు స్పీచ్‌లో మరో ఆసక్తికర కోణం - రాజకీయ ముసుగులో నేరాలు. “ఇప్పుడు నేరాలు రాజకీయ పీచులో దాగి ఉంటున్నాయి. వీటి వెనుక ఉన్న అసలు ముఖాలను బయటపెట్టాలి. లేదంటే లా అండ్ ఆర్డర్ తారుమారవుతుంది” అని బాబు హెచ్చరించారు. రాజకీయ అండతో జరిగే నేరాలను పోలీసులు భయపడకుండా ఛేదించాలని ఆయన సూచించారు. ఇక ట్రెడిషనల్ డ్యూటీ మైండ్‌సెట్‌‌ నుంచి బయటపడాలని స్పష్టం చేశారు. “ఇప్పటి పోలీసింగ్ ఓల్డ్ వెర్షన్‌లో నడిస్తే సరి కాదు. స్మార్ట్‌గా ఆలోచించాలి, వేగంగా స్పందించాలి” అని బాబు అన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ మాత్రమే కాదు, “ఇన్విజిబుల్ పోలీసింగ్‌” కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “పోలీసు ప్రత్యక్షంగా కనిపించకపోయినా ప్రజల్లో భరోసా ఉండాలి, నేరస్తుల్లో భయం ఉండాలి - ఇదే అసలు స్మార్ట్ పోలీసింగ్” అని బాబు దిశానిర్దేశం చేశారు.

సీసీ కెమెరాలు, సైబర్ ఫోకస్, మాఫియాలపై వేట - ఇవన్నీ ఏపీ పోలీసింగ్‌కి కొత్త రూపాన్ని ఇస్తాయని చెప్పారు. ప్రతి 55 కిలోమీటర్లకు సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం మాఫియాలను బలంగా అణచివేస్తున్నామని వివరించారు. “ఓల్డ్ థాట్స్ పక్కన పెట్టి, న్యూ వెర్షన్ పోలీస్‌గా మారండి” అని బాబు స్పష్టం చేశారు. అభివృద్ధి, పెట్టుబడులు అన్నీ లా అండ్ ఆర్డర్‌పైనే ఆధారపడతాయని చెప్పారు. “శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే కారణం — మన పోలీస్ సామర్థ్యం” అని బాబు గర్వంగా చెప్పారు. మొత్తానికి... బాబు స్పీచ్ మాస్ టోన్‌లో, టెక్ టచ్‌తో, ఫ్యూచర్ మైండ్‌సెట్‌తో నిండిపోయింది. ఏపీ పోలీసింగ్‌కి ఇది కొత్త దిశ చూపే రోజు అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: