తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా పేరు సంపాదించిన వారిలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. గడిచిన కొన్ని నెలల క్రితం తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ విషయంపై నాగార్జున పరువు నష్టం దావా  కూడా కోర్టులో వేయడం జరిగింది. మంత్రి చేసిన వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించారు. గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పైన చేసేటువంటి విమర్శల క్రమంలో మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పైన అలాగే నాగచైతన్య సమంత విడాకుల పైన చేసిన వ్యాఖ్యలు సంచలనాలకు దారితీసాయి. సమంత, నాగచైతన్య ల విడాకుల వ్యవహారం గురించి మాట్లాడగా. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారం, సమంత, నాగచైతన్య పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని అది వ్యక్తిగత నిర్ణయం అంటూ తెలిపారు నాగార్జున ..ఈ విషయాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ నాగార్జున కోర్టును అభ్యర్థించారు.



 అయితే ఇప్పుడు తాజాగా కొండా సురేఖ అర్ధరాత్రి నాగర్జున ఫ్యామిలీ పైన చేసిన ట్విట్ వైరల్ గా మారింది. నాగార్జున ఫ్యామిలీ పై చేసిన వ్యాఖ్యల పట్ల తాను పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నారని నాగార్జున ఫ్యామిలీని కించపరిచాలేనే ఉద్దేశం తనకి ఎప్పుడూ లేదని.. తన కామెంట్స్ పట్ల నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే , అందుకు తాను చింతిస్తున్నట్లుగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. గతంలో తాను చేసిన ఈ వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ మంత్రి కొండా సురేఖ తెలియజేశారు. అయితే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ట్విట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


సమంత నాగచైతన్య ప్రేమించుకొని వివాహం చేసుకోక కొన్ని కారణాల చేత విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత నాగచైతన్య , శోభితను ప్రేమించి మళ్లీ వివాహం చేసుకోగా.. సమంత ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: