బిహార్ ఎన్నికలను మోదీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ లో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. అలాగే కాంగ్రెస్, ఆర్జెడి పార్టీలను కూడా చాలా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, పథకాలను కూటమి ప్రజలలోకి చాలా బలంగా తీసుకువెళ్లారు. అలాగే నితీష్ కుమార్ కూడా రాష్ట్రంలో విస్తృతంగానే పర్యటించి తమ ప్రభుత్వం చేసిన పనులను చేయబోయే పనులను బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లారు.
ముఖ్యంగా నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అక్కడ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేశారు.మహిళలకు స్వయం ఉపాధి కోసం రూ.10వేల రూపాయలు ఆర్థిక సహాయం, మద్యపాన నిషేధం వంటివి మహిళ ఓటర్లను ప్రభావితం చేసినట్లుగా వినిపిస్తున్నాయి. మొదటి దశలో రికార్డు స్థాయిలో మహిళా ఓటర్లు వినియోగించుకున్నారు. ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయని బిజెపి నేతలు వెల్లడిస్తున్నారు.
అలాగే 1995 నుంచి 2004 వరకు ఆర్జెడి అక్కడ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువగా అవినీతి, నేరాలు వంటివి జరిగాయని ప్రచారాన్ని చేశారు ఎన్డీఏ కూటమి.
మహాఘాట్ బంధన్ నిరుద్యోగాన్ని లక్ష్యంగా చేసుకొని తామ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చినప్పటికీ బీహార్ ప్రజలకి నమ్మకం కలగలేదు అన్నట్లుగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి మాత్రం తాము అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ తెలిపారు. బడ్జెట్ విషయంలో కూడా బీహార్ కే ఎక్కువ నిధులు కేటాయించారు మోదీ ప్రభుత్వం.
ఇక ఓటింగ్ శాతం పెరగడానికి ముఖ్య కారణం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ జాబితాను సవరణ(SIR )చేసింది. ఇందులో 65 లక్షల మంది ఓటర్లు తొలగిపోయారు. దీనివల్ల కూడా ఓటింగ్ శాతం పెరిగినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆ పెరిగిన ఓటింగ్ శాతం ఎన్డీఏకు అనుకూలంగానే పడినట్లుగా భావిస్తున్నారు.
అయితే ఎన్నికలలో జన్ సురాజ్ పార్టీ, ఎంఐఎం పార్టీలు సైతం ఓట్లు చీల్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు వేరువేరుగా కలిపి 16 % వరకు ఓటింగ్ చీల్చినట్లుగా సర్వేలు తెలియజేస్తున్నాయి. నవంబర్ 14వ తేదీన ఫలితాలు వెలబడనున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి