జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా ముగిసింది.. చిన్నచిన్న గొడవలు తప్పించి పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం జూబ్లీహిల్స్ లో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. కనీసం సగం మంది కూడా ఓట్లు వేయడానికి ఆసక్తి చూపించినట్టు కనిపించడం లేదు. 48.47%  పోలింగ్ నమోదయింది. అయితే ఈ పోలింగ్ పూర్తిగా సీసీ కెమెరాల నిఘా, పోలీసులు భద్రత మధ్య కట్టుదిట్టంగా  పూర్తిచేసినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల కౌంటింగ్  ఫలితం ఈ నెల 14న  బయటకు రాబోతోంది. కేవలం రెండు, మూడు గంటల్లోనే పూర్తి ఫలితం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత నేనే గెలుస్తానని గట్టిగా చెబుతోంది. ఇక బిజెపి మూడవ స్థానానికి వెళ్లిపోయింది.  గెలుపుపై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చాయి. 

అయితే ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెసే విజయం సాధిస్తుందని చెప్పడంతో  కాంగ్రెస్ గెలుస్తుందని వారు భావిస్తున్నారు. అయితే ఓటు హక్కు వినియోగించుకున్న చాలామంది ఓటర్లు బయటకు వచ్చి కాంగ్రెస్ కే ఓటు వేసామని చెబుతున్నా,  లోపలికి వెళ్లి మాత్రం బీఆర్ఎస్ కే ఓటు వేసినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది  వ్యక్తులు ఓటర్లను కాస్త భయభ్రాంతులకు గురి చేసారని, కొంతమంది భయంతో కాంగ్రెస్ కే ఓటు వేశామని చెబుతున్నా కానీ, లోపలికి వెళ్ళాక మాత్రం బిఆర్ఎస్ కు ఓటు వేసినట్టు సమాచారం.. అయితే ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కే ఓటు వేసినట్టు చెబుతున్నా కానీ లోలోపల మాత్రం బీఆర్ఎస్ కే ఓట్లు ఎక్కువగా పడ్డాయని కొన్ని సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. ఓటర్స్ అలా చెప్పడానికి ప్రధాన కారణం కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫ్యామిలీకి భయపడి, ఏమంటాడో అని ఇలా చెప్పినట్టు తెలుస్తోంది..

మరి చూడాలి నిజంగానే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? లేదంటే తారుమారవుతాయా? అనేది మరికొన్ని గంటల్లో తేలబోతోంది.. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నిక ఫలితం అనేది అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకం. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే, మళ్లీ కొత్త ప్రాణం పోసుకొని తెలంగాణలో లేచి నిలబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే, అదే ఊపుతో బిఆర్ఎస్ పని అయిపోయిందని ఇక కాంగ్రెస్ దే భవిష్యత్తు అని చెప్పుకునే అవకాశం ఉంది. మరి చూడాలి ఎవరు జూబ్లీహిల్స్ పై జెండా పాతుతున్నారనేది ఎన్నికల ఫలితాల తర్వాతే బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: