కానీ ఫలితాలు పూర్తిగా వేరుగా వచ్చాయి. ప్రజల తీర్పుతో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ఏర్పడింది. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. ఇదే కథ 2015 ఎన్నికల సమయంలో కూడా జరిగింది. అప్పుడు లాలూ–నితీశ్ కలిసి పోటీ చేయగా, టుడేస్ చాణక్య వంటి పెద్ద సంస్థలు కూడా “ఎన్డీయే 155 సీట్లు సాధిస్తుంది” అని చెప్పాయి. కానీ అసలు ఫలితాల్లో మహాకూటమి 178 సీట్లతో ఘన విజయం సాధించగా, ఎన్డీయే కేవలం 58 సీట్లకే పరిమితమైంది. అలా గత రెండు సార్లు బీహార్ ఓటర్ల మనసును పసిగట్టడంలో ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో ఈసారి ప్రధాన జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా ఉండిపోయాయి.
ఇండియా టుడే, ఏబీపీ న్యూస్, సీఓటర్ వంటి సంస్థలు ఈసారి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు. కారణం స్పష్టమే - గతంలో ఎదురైన పరువు పోయే అనుభవాలు! బీహార్ ప్రజల రాజకీయ ధోరణి చివరి నిమిషంలో మారిపోవడం, కుల–మత–స్థానిక సమీకరణాల ప్రభావం, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్‌లు - ఇవన్నీ కలిపి బీహార్ రాజకీయాలను అంచనా వేయడం చాలా క్లిష్టం చేశాయి. మరోవైపు మహాకూటమి వర్గాలు “ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పక తప్పుతాయి” అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాము చేసిన ఇంటెన్స్ క్యాంపెయిన్, యూత్ ఓటర్ల మద్దతు, స్థానిక అసంతృప్తి అంశాలు ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. ఇక మూడు రోజుల తర్వాత అసలు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అప్పుడు తెలుస్తుంది — ఈసారి ఎగ్జిట్ పోల్స్ సరైనదా… లేక మళ్లీ బీహార్ ప్రజల తీర్పు వాటిని తలకిందులు చేస్తుందా?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి