అధికారుల ఒత్తిడితోనే ఈ సర్వేలు చెప్పించారని , నవంబర్ 14న ఫలితాలు మహాఘట్ బంధన్ కూటమికి అనుకూలంగా వస్తాయని, నవంబర్ 18 వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుందంటూ ధీమాతో మాట్లాడారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగగా అంతకుముందే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయని ఓటింగ్ ముగియకుండానే సర్వేలు ఎలా ప్రకటిస్తారు అంటూ కూడా ప్రశ్నించారు తేజస్వి యాదవ్. మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఫలితాలు మహాఘట్ కూటమికే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
1995 ఎన్నికల కంటే ఈసారి మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నామంటూ తెలిపారు. బీహార్ ప్రజలందరూ కూడా అధికార కూటమి పైన చాలా విసిగిపోయారని ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేశారని తెలిపారు. కచ్చితంగా బీహార్ ప్రాంతంలో మార్పు రాబోతోందని , ఇందులో ఎలాంటి అనుమానాలు లేవంటూ తెలిపారు తేజస్వి యాదవ్. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడుతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగగా మొదటి విడత నవంబర్ 6న, రెండో విడత నవంబర్ 11న జరిగాయి. ఈనెల 14వ తేదీన శుక్రవారం రోజున ఈ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అటు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి పార్టీలు సైతం తేజస్వి యాదవ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంచారు, ఎన్డీఏ కూటమి మాత్రం ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని ప్రకటించకుండానే ఎన్నికలలో పోటీకి దిగారు. మరి ఏం జరుగుతుందో నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి