జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనేది చాలా ఉత్కంఠ గా సాగింది. కొన్ని నెలలుగా ఎంతో హోరా హోరీగా సాగినటు వంటి ఉప ఎన్నిక భవితవ్యం మరి కొన్ని నిమిషాల్లో బయటకు రానుంది. ఓట్ల లెక్కింపు కు అధికారులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి కట్టు దిట్టమైన భద్రత  ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ కూడా విధించారు. ఇదిలా నడుస్తున్న సమయం లో ఎన్నికల ఫలితం పై ప్రజలందరికీ ఉత్కంఠ గా మారింది.. చివరి ఫలితం ఎప్పుడు వస్తుందనేది  ఆసక్తి రేపుతోంది.. యూసఫ్ గూడా లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన  ఎన్నికల లెక్కింపు ప్రక్రియ 8:00 గంటలకు ప్రారంభం కానుంది. ..

ప్రతి 40 నిమిషాలకు ఒకసారి ఫలితం ఉంటుంది. 10 రౌండ్లు పూర్తయ్యే సరికి ఎవరు గెలుస్తారు అనేది తప్పని సరిగా తెలిసి పోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం  1 నుంచి 2 గంటల వరకు తుది ఫలితం అనేది బయటకు వస్తుంది. ఒక్కో వరుసకు 21 టేబుల్ లో చొప్పున రెండు వలసల్లో 42 టేబుల్ లు ఏర్పాటు చేసి పెట్టారు. ఒక్కొక్క రౌండ్ కు 42 కేంద్రాలకు సంబంధించిన ఫలితాలు బయటకు వస్తూ ఉంటాయి.  ఈ లెక్కింపు ప్రక్రియలో మొత్తం 186 మంది పాల్గొనబోతున్నారు.

  లెక్కింపు ప్రారంభం కాగానే మొదటి రౌండ్ కాస్త లేట్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం 13 బ్యాలెట్ బాక్స్ ల ఓట్ల లెక్కింపు.. లెక్కచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది. అందుకే మొదటి రౌండ్ ఆలస్యం అవుతుందని అధికారులు తెలియజేశారు. మొత్తానికి మధ్యాహ్నం రెండు గంటల వరకు తుది ఫలితం వస్తుంది.నాలుగు గంటల వరకు ఎన్నికల అధికారులు గెలిచిన  అభ్యర్థి ని అధికారిక ఎమ్మెల్యే గా ప్రకటించి సర్టిఫికెట్ అందజేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: