ఎన్నికలు వచ్చాయి అంటే తప్పనిసరిగా ఆ రిజల్ట్ పై ప్రజలకు చాలా ఆసక్తి ఉంటుంది... ముఖ్యంగా దేశవ్యాప్తంగా బిహార్ ఎన్నికలపై ఆసక్తి నెలకొని ఉంది.. బిహార్ రాష్ట్రంలో ఏ పార్టీ జెండా పాతుతుంది. ఎవరిని గెలుపు వరిస్తుంది అనేది ఉత్కంఠ గా మారింది. అలాంటి ఈ తరుణంలో మరికొన్ని నిమిషాల్లో బీహార్ ఎన్నికల లెక్కింపు మొదలుకానుంది. బీహార్ చరిత్రలోనే అత్యధికంగా 67.13% పోలింగ్ నమోదయింది. దీంతో బిహార్ ప్రజలు ఎవరికి ఓటు వేశారు. బ్యాలెట్ బాక్సుల్లో ఎవరికీ మగ్గుంది అనేది చూద్దాం.. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  ఇందులో రెండు ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు.. మొత్తం ఓటర్ల సంఖ్య 7.45 కోట్లు. అయితే బీహార్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశ నవంబర్ 6న 121 స్థానాలకు పోలింగ్ జరిగితే రెండవ దశ నవంబర్ 11న 122 స్థానాలకు పోలింగ్ జరిగింది.

 ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 102 సీట్లు వస్తే చాలు. ఇదిలా నడుస్తున్న సమయంలో  ఓవైపు ఎండీఏ కూటమి మారోవైపు మహాగట్ బంధన్ కూటమి హోరా హోరీగా మేం గెలుస్తామంటే మేం గెలుస్తామంటూ చెప్పుకొస్తున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్ని  ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపాయి. ముఖ్యంగా ఎన్డీఏ పార్టీ అభ్యర్థులు శాంతిభద్రతలు,మౌలిక సదుపాయాలు,  నితీష్ కుమార్ సుపరిపాలన డబుల్ ఇంజన్ సర్కార్ తదితర అంశాలను ముందు పెట్టుకొని ప్రచారం చేసింది.

ముఖ్యంగా మహిళలకు అనేక హామీలు ఇచ్చింది. 50 లక్షల కోట్ల మంది పెట్టుబడులు పెట్టేలా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఇక మహాగట్ బంధన్ పార్టీవారు ఉపాధి, యువతకు సంబంధించిన సమస్యలు ఓట్ల చోరీ, సర్కార్ కు సంబంధించిన వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని ఎన్నికల్లో ప్రచారం చేసింది.. ఈ విధంగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని నమ్మారు.. ఎవరిని ఓడించారు అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: