కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రం లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో మొదటి నుండి కూడా కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ , బీ జే పీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ మూడు  పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాలను చేశారు. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలి అని రెండు పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. అలాగే ఆ పార్టీ పెద్దలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం ఎంత గానో కష్టపడ్డారు. ఇక కొన్ని రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందు , ఎన్నికల తర్వాత ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా అని సామాన్య ప్రజ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అనేది మరి కొన్ని గంటల్లో తెలియబోతుంది. ఈ రోజు అనగా నవంబర్ 14 వ తేదీన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను ఏ పద్ధతిలో విడుదల చేయబోతుంది ..? ఎన్నికల కౌంటింగ్ ఎక్కడ జరగబోతుంది ..? అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

ఈ రోజు ఉదయం 8 గంటలకు యూసఫ్ గూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ 10 రౌండ్లలో ముగించబోతోంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రదేశం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ 144 సెక్షన్ ను ఇప్పటికే అమలు చేశారు. షేక్‌ పేట డివిజన్‌ తో మొదలై ఎర్ర గడ్డ తో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగుస్తుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మొత్తం 1,94,631 ఓట్లు పోలయ్యాయి. మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: