రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు ఇలా ఉన్నాయి. రౌండ్ 1లో షేక్ పేట్‌లోని 42 బూత్‌లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ తర్వాత రౌండ్ 2లో షేక్ పేట్, ఎర్రగడ్డ, వెంగళరావునగర్‌లలోని మరో 42 బూత్‌లను లెక్కించారు. రౌండ్ 3లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్‌లలోని 42 బూత్‌లలో కౌంటింగ్ కొనసాగింది. రౌండ్ 4 & 5లో వెంగళరావు నగర్, రహమత్ నగర్‌లలోని మొత్తం 84 బూత్‌లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
దీని తర్వాత రౌండ్ 6 & 7లో వెంగళరావు నగర్, యూసఫ్ గూడ, సోమాజిగూడలోని 84 బూత్‌లలో లెక్కింపు జరుగుతుంది. ఇక చివరి దశలలో, రౌండ్ 8 & 9లో సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండలోని 84 బూత్‌లలో ఓట్లను లెక్కించనున్నారు. ఫైనల్‌గా, చివరిదైన రౌండ్ 10లో ఎర్రగడ్డలోని 29 బూత్‌లలో ఓట్ల లెక్కింపుతో ఫలితం పూర్తిగా వెలువడనుంది. ఈ పది రౌండ్ల లెక్కింపు తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపొందిన అభ్యర్థి ఎవరో స్పష్టమవుతుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వెలువడతాయో అనే చర్చ సైతం జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి