పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులోనే హత్య చేసినట్లుగా గడిచిన కొన్ని గంటల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. జైల్లో ఉన్న ఆయనని కలవడానికి ఎవరికీ కూడా అనుమతి ఇవ్వకపోవడంతో ఈ విషయంపై మరింత అనుమానాలను వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో చంపేశారా? అంటూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి రూమర్స్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆయనను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణల పైన 2023 నుంచి ఆడియాలా జైలులో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్.


గడిచిన మూడు వారాల నుంచి తమ సోదరుడిని కలవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో అటు సోదరీమణులు కూడా ఈ విషయం పైన ఆందోళన చెందుతున్నారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు  సోషల్ మీడియా హ్యాండిల్లో వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు బలుచిస్తాన్ విదేశాక మంత్రి ఇలా ట్వీట్ చేస్తూ..కస్టడీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ , అతని ISI పరిపాలన చంపేశారంటూ వార్తలు వెలుబడుతున్నాయి.. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఉగ్రవాద పాకిస్థాన్ కు సంపూర్ణ ముగింపు లభిస్తుందంటూ తెలిపారు. అలాగే మరొకవైపు పిటిఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో రహస్యంగా చంపేశారు అంటూ మీడియాలో ప్రకటించారు.అయితే ఈ వార్తలను సైతం అక్కడ అధికారులు , పాక్ సైనిక అధికారులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారని తెలియజేస్తున్నారు.



ఈ విషయాల కంటే ముందు పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడ ఒక నెల నుంచి ఇమ్రాన్ ఖాన్ కలవడం పైన నిషేధం కూడా విధించినట్లు వినిపిస్తున్నాయి.. అలాగే సోహైల్ అఫ్రిదిని కూడా ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు ఏడుసార్లు ప్రయత్నించిన అనుమతి ఇవ్వలేదని తెలియజేశారు. మరి ఇమ్రాన్ ఖాన్ హత్య రూమర్స్ పై ప్రజలలో గందరగోళం ఏర్పడింది. మరి ఈ విషయం పైన అధికారి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: