ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు సైతం తాజాగా కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తోంది. ఏ క్షణమైనా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి.ఇప్పటికే విభాగాల వారీగా ఖాళీలను కూడా సేకరించామని ఆయా శాఖలలో మంజూరైన పోస్టులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఖాళీల వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లుగా తెలియజేశారు. ఇప్పటికే కొన్ని విభాగాల వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేసినట్లుగా సమాచారం. మరికొన్ని ప్రాసెస్ లో ఉన్నాయని పూర్తి వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.


ఇక ఏపీ ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం అన్ని శాఖలలో దాదాపుగా 30% మేరకు ఖాళీలు ఉన్నట్లుగా తెలియజేశారు. అంటే సుమారుగా లక్ష వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇంకా మరో 24 విభాగాల ఖాళీలను కూడా నిర్ధారించలేదట. అలాగే మరొక 21 శాతం వరకు వివరాలను నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యా శాఖలో 7000 ఖాళీలు, విశ్వవిద్యాలయాలలో 3000కు పైగా ఖాళీలను కోర్టు కేసును తొలగించి భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

అలాగే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలలో 27,000 ఖాళీలు ఉన్నాయని, ఇందులో 23000 నియమించేందుకు సిద్ధంగా ఉన్నదట. వ్యవసాయ శాఖలు 3000, పంచాయతీరాజ్ శాఖ 26 వేల పోస్టులు, మహిళా శిశు, విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్ విభాగంలో 2500 ఖాళీలు, ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖలో 10వేల వరకు ఖాళీలు ఉన్నాయి. ఇలా సుమారుగా అన్నిటిలో కలిపి లక్షకు పైగా ఖాళీలు ఉన్నట్లుగా సమాచారం అలాగే ఇందులో కొన్ని ప్రమోషన్స్ ద్వారా కూడా నియమించే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. త్వరలోనే పెద్ద ఎత్తున  జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో కచ్చితంగా ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే కానిస్టేబుల్ 11,000 పైగా ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి.త్వరలోనే వీటిని కూడా భర్తీ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: