భారతదేశంలో హిందూ పురాణాల ప్రకారం కొన్ని మొక్కలను చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని మొక్కలను చాలా భక్తితో పూజిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో తులసి, వేప, తెల్ల జిల్లేడు మొక్కలే కాకుండా రావి చెట్టు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ రావి చెట్టును సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా భావిస్తూ ఉంటారు హిందువులు. అందుకే రావి చెట్టుకి పూజలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే రావి చెట్టుకి ఉదయం లేవగానే నీరు పోసి పూజించడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు చూద్దాం.



ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత రావి చెట్టు ను దర్శించుకుని, రావి చెట్టు దగ్గర ఆవు పాలు, నువ్వులు ,చందనం వంటి వాటిని పోసి జలాభిషేకం చేసి పూలమాల వేయడం వల్ల జాతకంలో ఉండే శని దోషాలు వంటిది తొలగిపోతాయి. రావి చెట్టు దగ్గర దీపం పెట్టేవారు ఆవనూనెతో దీపాలను వెలిగించడం మంచిది. అలాగే రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షణలు చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.రావి చెట్టును పూజించడం వల్ల పితృదేవతలు కూడా శాంతిస్తారు.


రావి చెట్టుని ప్రతిరోజు పూజ చేసినప్పటికీ మంగళవారం, ఆదివారం  సాయంత్రం వేళ రాగి చెట్టుని తాకకపోవడమే మంచిదని పండితులు సైతం తెలియజేస్తున్నారు. శనివారం రోజున ప్రత్యేకించి పూజ చేసి తమ మనసులో ఉన్న కోరికను కోరుకోవడం వల్ల ఆ కోరిక నెరవేరుతుందని పండితులు సైతం తెలియజేస్తున్నారు. రావి చెట్టుని పూజించడం వల్ల వివాహ జీవితంలో ఎలాంటి అడ్డంకులు, కలహాలు ఉన్న తొలగిపోతాయి. అంతేకాకుండా రావి చెట్టుకి పూజ చేసే సమయంలో వినాయక విగ్రహాన్ని లేదా హనుమాన్ చాలీస్ ను చదవడం వల్ల ఆ దేవతల అనుగ్రహాలు లభిస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితులలో రాగి చెట్టుని నరకడం వంటివి చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: