ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి మొదటి వారంలోనే రానుంది. జ్యోతిష్య పండితులు తెలుపుతున్న ప్రకారం మార్చి మూడవ తేదీ మంగళవారం రోజున కేతు గ్రహ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడినది. దృక్ సిద్ధాంత పంచాంగం ప్రకారం చంద్రగ్రహణం పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో వస్తుందట. విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం ఇండియాలో కూడా కనపడనుంది. ఈ సందర్భంగా గ్రహణ సమయాలు, పాటించాల్సిన నియమాలు వంటి వాటి గురించి పండితులు సైతం తెలియజేస్తున్నారు.


పండితులు తెలుపుతున్న ప్రకారం.. పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ గ్రహణ సమయంలో సాధారణ నియమాలను పాటించాలని, మనదేశంలో గ్రహణం  ప్రారంభమయ్యే  సమయానికి చంద్రోదయం ఉండదని కానీ గ్రహణం ముగిసే సమయానికి మాత్రం చంద్రోదయం జరుగుతుందని తెలియజేస్తున్నారు.

చంద్రగ్రహణం ప్రారంభం : మధ్యాహ్నం 3:21 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6:48 నిమిషాలకు ముగుస్తుంది. మొత్తం మీద 3 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలలో ఆలయాలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 నిమిషాల వరకు మూసి వేయబోతున్నట్లు ప్రకటించారు. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి మరి తిరిగి ఆలయాలను తెరుస్తారు.


ఈ గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు:
ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోవడమే మంచిది.

ఎవరైనా సరే మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం పూర్తి చేయాలి.


ఇంట్లో ఉండే ఊరగాయలు, పచ్చళ్ల పైన మూతలు మూసి ఉంచాలి.


గర్భిణీ స్త్రీలు రేపు బయటికి రాకూడదని పండితుల సైతం హెచ్చరిస్తున్నారు. అలాగే గ్రహణం మోక్షకాలం తర్వాత స్నానమాచరించి దీపారాధన చేయాలని తెలియజేస్తున్నారు.

రాత్రి 7:30 నిమిషాల తర్వాత స్నానం చేసి దైవారాధన చేసిన తర్వాత భోజనం చేయవచ్చు. ముఖ్యంగా స్నానం సముద్రం లేదా నది దగ్గర స్నానం చేయడం చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. ఈ గ్రహ ప్రభావం ఎక్కువగా మకర, సింహ, కుంభ, కర్కటక రాశుల వారి పైన ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: