ముఖ్యంగా వేల ఎకరాల భూములు రాజధాని పేరిట కూటమి ప్రభుత్వం దోచుకుంటుందంటూ విమర్శించారు. అంతేకాకుండా ఇప్పటివరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలుపుతున్నారు.అంతేకాకుండా రావాలి జగన్.. కావాలి మావిగన్ అంటూ పోస్టర్లు , ప్లెక్సీలు భారీ ఎత్తున వేయించారు. వీటికి తోడు జగన్ ఇంటి ముందు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు మరింత హైలెట్ గా మారాయి. దీంతో అటు కూటమి ,వైసీపీ మధ్య క్యాపిటల్ వార్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అమరావతికి చట్టబద్ధత రావడంతో సీఎం చంద్రబాబుతో పాటుగా రాజధాని రైతులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అమరావతికి హోదా లభించడంతో టీడీపీ గ్రాఫ్ పెరిగిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు వైసీపీ ప్లాన్ కనిపిస్తోంది.
మావిగన్ అనే పేరును ప్రతిపాదన చేసిన తర్వాత ప్రజలలో చర్చ జరిగేలా వైసిపి చేయడంలో సక్సెస్ అయిందని టాక్ ఇప్పుడు ఏపీ అంతా వినిపిస్తోంది. దీంతో అమరావతికి చట్టబద్ధత లభించినప్పటికీ జగన్ వస్తే ఖచ్చితంగా ఏదో చేస్తారని ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు కూడా ప్రజలలోకి మావిగన్ పేరుని బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వేలకోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో అప్పులు చేస్తోందని, మావిగన్ ఏపీకి గ్రోత్ ఇంజన్ అంటూ వైసీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. వీటికి తోడుగా పోస్టర్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులతో సరికొత్త క్యాంపెయిన్తో ముందుకు వెళ్తోంది.
ఏపీకి అమరావతి ఆర్థిక భారమని, మావిగన్ రాజధాని ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయం పైన వైసిపి ఎత్తుగడలు కొంతమేరకు సక్సెస్ అయినట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి విషయంలో టిడిపికి కూటమి సర్కార్ కి అనుకున్నంత స్థాయిలో మైలేజ్ రాకుండా వైసిపి పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి