చాలామంది ఉద్యోగస్తులు కొంత విరామం దొరికితే చాలు టి, సిగరెట్ వంటివి ఎక్కువగా తాగుతూ ఉన్నారు. దీనివల్ల చాలామందికి ఉపశమనం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కొంతమంది పరిశోధకులు తెలిపిన ప్రకారం ఈ అలవాటు వల్ల అన్నవాహిక కణాలను దెబ్బతీసి క్యాన్సర్ కు కారణం అవుతుందని తెలియజేస్తున్నారు . వేడి టి అన్నవాహిక లోపల చిన్న గాయాలను కలిగించేలా చేస్తుందని ఆ సమయంలో సిగరెట్ తాగడం కూడా చాలా హానికరం ఆ రసాయన పొగ వల్ల ఆ గాయాల ద్వారా నేరుగా శరీరంలోకి చేరి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందంటూ తెలియజేస్తున్నారు.


వేడి టీ తాగినప్పుడు వచ్చే మంటకు సిగరెట్టు పొగ రసాయనాలు తోడైతే మాత్రం అది కణాల నాశనానికి తోడ్పడి క్యాన్సర్ కణాలను అభివృద్ధి చెందేలా చేస్తుంది.



సిగరెట్లు ఉండే ఫార్మల్డిహైడ్, బెంజిన్ అంటే రసాయనాలు గొంతును దెబ్బ తినేలా చేస్తాయి. అలాగే వెంటనే టీ తాగడం వల్ల గొంతు కణజాలం కూడా బలహీనపడి గొంతు క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది.


సిగరెట్ పొగాకులో నికోటిన్ రక్తపోటును పెంచితే, టీ లో కెఫిన్ గుండెపైన అదనపు భారాన్ని పెంచేలా చేస్తుంది. ఈ రెండిటి వల్ల గుండెపోటుకి దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


టీ, సిగరెట్  ఒకేసారి ఖాళీ కడుపుతో తాగితే మాత్రం మెదడుకు రక్తప్రసరణ తగ్గి తలనొప్పి , జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు ఏర్పడతాయి.


నికోటిన్, కెఫిన్ రక్తనాళాలను సంకోజింప చేసేలా చేస్తాయి. దీని ఫలితంగా రక్త పోటు పెరిగి ధమనులలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల పక్షవాతానికి కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అందుకే ఈ రెండు అలవాటులను ఎంత వీలైతే అంత దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ రెండు అలవాట్ల వల్ల జీర్ణ వ్యవస్థలోని లోపలి పొరలను సైతం దెబ్బతీసేలా చేస్తాయని అల్సర్, అసిడిటీ వంటి వాటికీ కూడా గురయ్యేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: