తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా... మీకోసం పాదయాత్రతో ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ సుదీర్ఘ పాదయాత్రలో బాబు ఎన్నో మైలు రాళ్ళు అధిగమించారు. 1500 మైళ్ళు సునాయాసంగా నడిచి సరికొత్త రికార్డు సృష్టించారు.
గతంలో 53 ఏళ్ల వయసులో వైఎస్ రాజశేఖర్రెడ్డి చేసిన 1468 కి.మీ పాదయాత్రను 63ఏళ్ల వయసులో చంద్రబాబు అధిగమించి రికార్డు సృష్టించారు. వరంగల్ జిల్లాలో ఏడో రోజు పాదయాత్రలో ఉన్న బాబు దస్రూనాయక్ తండాలో 1500 కిలోమీటర్ల మైలురాయిని దాటి వైఎస్ రికార్డును బద్దలు కొట్టారు. చంద్రబాబు 1500 కి.మీ. మైలు రాయిని చేరడంతోనే టిడిపి శ్రేణులు ఉత్సాహంతో కనిపించారు. బాబు కు పలువురు అభినందనలు తెలిపారు.
బాబు చేపట్టిన ఈ మొదటి దశ పాదయాత్ర రాయలసీమలోని అనంతపురం జిల్లాతో మొదలై కర్నూలు, తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం మీదుగా కోస్తాలోని కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్ళనున్నారు. ఇందులో వెళ్ళడానికి కుదరని వాటిని రెండో దశలో పూర్తి చేస్తారు. దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒక భాగాన్ని రెండో దశలో పూర్తి చేస్తారు.
బాబు మొదటి దశలోనే దాదాపు 2300 కి.మీ మేర నడవనున్నారు. రెండో దశ కూడా చేపడితే దాదాపు 3000 కిలోమీటర్లు నడిచి సరి కొత్త చరిత్ర సృష్టించిన ఘనత చంద్రబాబు సొంతమవుతుంది!
మరింత సమాచారం తెలుసుకోండి: