ఏమైంది...అమ్మా పాప ఏడ్చింది,అయితే వుడ్ వర్డ్స్ పట్టమని చెప్పు ...అన్న యాడ్ అందరికి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రేస్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు ఇలాగే ఉంది.చీమ చిటుక్కుమన్నా సరే సిఎం తో సహా కాంగ్రేస్ నేతలంతా చేస్తున్న పని ఇదే. ఎలాగంటారా...పోలవరం టెండర్లలో గోల్ మాల్ జరిగిందట, అలాగా నివేదిక తెప్పించండి,ఆతర్వాత కమిటి వేయండి.ఎన్నికల్లో ఓడిపోయాం...ఏముంది ముందు నివేదిక పంపించండి,చూసాకా కమిటి వేస్తాం. మంత్రిపై కేసుపెట్టారు...నివేదిక ఆపై కమిటి.ఇందిరమ్మపథకంలో అవకతవకలు,పార్టీలో కోవర్టులు, సిఎం,పిసిసి ల మద్య విభేదాలు,మాటవినని మంత్రులు ఇలా చీమ చిటుక్కుమన్నా చాలు కాంగ్రేస్ పెద్దలు వెంటనే చేసే పని ముందు నివేదిక ఆతర్వాత కమిటి. పోనీ వేటినైనా పరిష్కరించారా అంటే అదీ లేదు.మొదలు వేసిన కమిటి నివేదిక అధిష్టానానికి చేరకముందే లీకవుతుంది.దీనిపై విపక్షాలమాట దేవుడెరుగు స్వపక్షనేతలే విమర్శలు వెల్లువలా కురిపిస్తారు,నానా రభస సృష్టిస్తారు. వెంటనే మొదటి కమిటి నివేదిక చదవకుండానే దానిపై విచారణకు రెండో కమిటి.ఇదీ ...రాష్ట్ర కాంగ్రేస్ పరిస్థితి. పలితం ఏది ముందుకు పోకా,ఏపని కాక ప్రజలకు ప్రాణసంకటం,విపక్షాలకు వింత నాటకంలా తయారైంది. ఇప్పుడు మంత్రి ధర్మాన రాజీనామా విషయంలోను జరుగుతున్నదదేనండి. ఇది ఇంకా కమిటీ వేయడం వరకు వెల్లలేదు,నివేదిక తెప్పించుకోవడం మాత్రం పూర్తయింది. ఈవిషయంలో ఏం జరుగుతుందో వేరే చెప్పక్కర్లేదు కదా...ఎందుకంటే ఇప్పటికే మీకంతా అర్థమయింది కాబట్టి. 

మరింత సమాచారం తెలుసుకోండి: