ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వ‌మ‌న్నారు పెద్ద‌లు. సొంత జిల్లాలో స‌మ‌స్య‌ల‌ను వ‌దిలి మిగిలిన జిల్లాల్లోని స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించే ప‌నిలో ప‌డ్డారు ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. క‌డ‌ప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌ల‌ను అంద‌ల‌మెక్కించారు ప్ర‌జ‌లు. అయితే ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిస్థితులు మారుతున్న త‌రుణంలో.. వీరిలో ఆలోచ‌న మొద‌లైందట‌. తాము గెలిపించిన నాయ‌కులు నాలుగేళ్ల‌లో ఏం చేశారా? అని వెన‌క్కి తిరిగి చూస్తే.. అంతా శూన్య‌మేన‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొద‌లైంది. `ఏం చేసేది.. ప్రతిపక్షంలో ఉన్నాం.. మా మాట ఎవరూ వినడంలేద`న్న నైరాశ్యంలో ప్రధాన ప్రతిపక్షం సభ్యులు చెబుతున్నారు. అయినా వీరి వాద‌న‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్నార‌ట‌. క‌డ‌ప‌లో వైసీపీ బ‌లం నానాటికీ త‌గ్గుతూ వ‌స్తుండ‌టం.. పార్టీ శ్రేణుల‌ను క‌ల‌రానికి గురిచేస్తోంది. 
 Image result for tdp
జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రజాప్రతిని ధులుగా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామన్న నైరాశ్యంలో ఉన్నార‌ట‌, ఎమ్మెల్యేలు ఎన్నికైన నాలుగేళ్లలో వారి పనితీరుపై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జిల్లాలో 2014 మే 7న పది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అదే నెల 16న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించా రు. ఈ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో వైసీపీ, ఒకే స్థానంలో టీడీపీ గెలుపొందాయి. మారిన రాజకీయ సమీకరణలతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం మూడుకు పెరిగింది. బుధవారానికి ఈ ఎమ్మెల్యేలకు ఎన్నికై నాలుగేళ్లు గడిచింది. ఈ స‌మ‌యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ప్రజలతో ఎలా మెలుగుతున్నా రు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర వాటిపై వివిధ వర్గాల నుంచి వివరాలు ఆరా తీయ‌గా ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు వ‌చ్చాయ‌ట‌.

Image result for ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

పులివెందుల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జగన్‌కు 75 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అలాంటి నియోజకవర్గాన్ని జగన్‌ పూర్తిగా విస్మరించారనే విమర్శలున్నాయి. ఒకటి, రెండుసార్లు తప్ప పులివెందుల అభివృద్ధిపై జగన్‌ సమీక్షలు జరిపింది లేదు. మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ మైదుకూరుకు అప్పుడప్పుడూ వెళుతుంటారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నా సమస్యలు పరిష్కరించడంలో సతమతమవుతున్నారు. రైల్వేకోడూ రు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి సాధించిందేమీ లేదు. క మలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి గెలిచిన ఏడాది వరకు నియోజకవర్గంలో తిరిగినా ఆ తరువాత పర్యటనలు పూర్తిగా తగ్గించేశార‌ట‌. 

Image result for రాచమల్లు ప్రసాద్‌రెడ్డి

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నీటి సమస్య పరిష్కారం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ప్రజలతో మమేకమై నడుస్తున్నారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా పేరుకు ఎమ్మెల్యేగానే ఉంటున్నా పెత్తనం మేయర్ సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ‌రెడ్డిదే అన్నట్లుగా ఉంటోంద‌ట‌. బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములు పార్టీ మారడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే, మంత్రి సి.ఆదినారాయణరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడం లేద‌ట‌. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీకి ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో రాష్ట్ర విప్‌ పదవి దక్కింది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ప్రజా సమస్యలపై గళం విప్పని పరిస్థితి నెలకొంది. విపక్షంలో ఉన్నామ‌ని అందుకే తాము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయా మని చెబుతున్నారు. ప్ర‌స్తుతం సొంత జిల్లాలో జ‌గ‌న్‌కు ఇబ్బందులు త‌ప్పేలా లేవు. 



మరింత సమాచారం తెలుసుకోండి: