తెలుగు సినిమా రచయిత చిన్ని కృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల భీమవరం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను చిన్నికృష్ణ ఖండించారు. రాజకీయాల్లో స్వార్థం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని మాట్లాడుతూ...రాజకీయాలలో పవన్ కళ్యాణ్ కి మంచి భవిష్యత్ ఉందని..ఎప్పటికైనా కాపు కులానికి చెందిన నాయకుడు రాజాధికారం పొందుటకు అవకాశాలు రాజ్యాంగం ఇచ్చిందని...కష్టపడితే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే అవకాశం ఉందని...కానీ ఇప్పుడు మాత్రం లేదని చిన్నికృష్ణ తెలిపారు.

Related image

ముఖ్యంగా కాపు కులానికి చెందిన ప్రజలు కాపుల అంటే కేవలం చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే కాదని..ఆ బ్రమలో ఉంటే బయటికి రావాలని..కాపు కులం అంటే రంగా మరియు ఇతర ఇతర కుటుంబాలు ఉన్నాయని...ప్రజారాజ్యాన్ని నమ్ముకుని చాలామంది కాపు వర్గానికి చెందిన ప్రజలు..చిరంజీవి చేసిన పనికి తలదించుకోవాల్సి వచ్చిందని...ఆనాడు 70 లక్షల మంది చిరంజీవిని నమ్మి ఓటు వేస్తే ఆ తర్వాత తన స్వార్ధం చూసుకొని పార్టీని ఏం చేశారో అందరికీ తెలిసిందే అంటూ సంచలన కామెంట్ చేశారు.

Image result for pawan jagan

అయితే ప్రస్తుతం కాపులు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరును గమనించాలని గతంలో జరిగిన అవమానం పునరావృతం కాకుండా ఉండాలంటే..జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ముందు నుండి ప్రజల పక్షాన పోరాడిన వైసీపీ అధినేత జగన్ కి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..ఈసారి సీఎం అయ్యే అవకాశాలు జగన్ కి ఎక్కువగా ఉన్నాయని..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: