స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లతో యువతకు మంచి నైపుణ్యం అందుతుందన్నారు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు. ప్రభుత్వం కల్పించే విద్యతో థియరిటికల్ నాలెడ్జ్ వస్తోందని ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలంటే మాత్రం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల కావాలంటున్నారు.


ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువత మన దేశంలో ఉన్నారనీ విద్యాసాగర రావు తెలిపారు. మెట్ పల్లిలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయటం మంచిపరిణామమన్నారు. మైహోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ రామేశ్వరరావు  గారు మాట్లాడుతూ మన దేశంలో యువత అత్యధిక సంఖ్యలో ఉండటం పెద్ద అడ్వాంటేజ్ అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు గత కొన్నేళ్లుగా జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టాటా స్ర్టైవ్ ఎక్స్ టెన్షన్ సెంటర్ ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని అమ్మక్కపేట వైఎస్సార్ కాలనీ లో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ రామేశ్వర రావు, ఎంపీ బండి సంజయ్, పలువురు ప్రముఖులు  మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొంది,  "మొత్తం ప్రపంచంలోనే తక్కువ వయసున్న యంగస్ట్ చిల్డ్రన్ మన భారత దేశంలో ఉన్నారు. సరాసరి వారి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలలే అంటే  చైనా వారి కన్నా అమెరికా వాళ్ళ కన్నా వారి సరాసరి వయసు కన్నా మనం ఎనభై సంవత్సరాల చిన్న.  మనకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది. ఇటువంటి స్కిల్ డెవలప్ మెంట్ లేకపోతే కేవలం ప్రభుత్వం, ప్రభుత్వ  కాలేజీలతోనే పని కాదు.  ఆ కాలేజీలలో విద్య కుడా వేరే పద్దతిలో ఉంది. మనం అనుకున్నట్టు విద్య లేదు. ఎదో డిగ్రీలతో పోతుంది మొత్తం అంతే గాని స్కిల్ డెవలప్మెంట్ లేదు.

ఇలాంటి స్వచ్చంద సంస్థలు రావడం వల్ల  యువతకి మేలు జరుగుతుంది. ఈ రోజు భారతదేశానికి ఉన్న అడ్వెంటేజ్ యువత చాలా పెద్ద సంఖ్యలో ఉండటం. గ్రామస్థాయి లోకి  వచ్చి ఇలాంటి సెంటర్స్ పెట్టడం వాళ్ళ యువత చాలా లాభపడుతుంది.  ఈ జిల్లా ల్లో ఇలాంటి సెంటర్స్ పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నట్టు మరియు ఈ సెంటర్స్ లో అన్నింటిని సమకూర్చి జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు అప్పచెప్తున్నట్టు  తెలియ చేసారు మరియు ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అన్ని సెంటర్లలో అడాప్ట్ చేసుకునందుకు సంతోషంగా ఉంది " అని రామేశ్వర రావు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: