వెనుకటికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి ఏదో ఒక జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వచ్చింది. రాజయ్య రెచ్చిపోయి హామీలు ఇస్తున్నాడని, అవన్నీ సాధ్యం అయ్యేవి కావని కేసీఆర్ తేల్చిచెప్పాడు. మరీ దారుణంలో రాజయ్య మెడికల్ కాలేజీ హామీ ఇచ్చిన వేదిక మీదే కేసీఆర్ ఆ మంత్రిగారి తీరును తప్పుపట్టాడు.  అవన్నీ సాధ్యం అయ్యే హామీలు కాదంటూ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత కేసీఆర్ మాటలపై పెద్ద దుమారమే రేగింది. ఒక దళిత మంత్రిపై కేసీఆర్ జులుం చేశాడని ప్రతిపక్షాల వాళ్లు మీడియా ముందుకువచ్చారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ తీరును వారు ఖండించారు. మరి అప్పటి వివాదం సంగతి అలా ఉంటే... తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి రాజయ్య మరోసారి ఆ విషయాన్ని ప్రకటించాడు.  తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని రాజయ్య హామీ ఇచ్చాడు. సభాముఖంగా ఆయన ఈ ప్రకటన చేశాడు. కేవలం రాజయ్యమాత్రమే కాదు.. రాజయ్యకు తోడు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికూడా తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి సభలోమెడికల్ కాలేజీల ఏర్పాటు విషయాన్ని ప్రకటించారు. మరి అప్పట్లో రాజయ్య ఈ విషయాన్ని ప్రకటిస్తే కేసీఆర్ తప్పు పట్టాడు. ఈ సారిమాత్రం కేసీఆర్ మంత్రుల ప్రకటనను ఖండించకపోవడం విశేషం. అప్పట్లో ఒక జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని అంటేనే సాధ్యం కాదన్నట్టుగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అని మంత్రులు ప్రకటించిన సభలో ఉండి కూడా సైలెంట్ గా కనిపించాడు. మరి ఇప్పుడు అలా కాలేజీలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందని కేసీఆర్ కూడా నమ్ముతున్నాడేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: