క‌డ‌ప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి పీఠం పై వివాదం రోజురోజుకు ముదురుతుంది.బ్ర‌హ్మాంగారి వార‌సుడు ఎవ‌రు అనేది దానిపై వివాదం కొన‌సాగుతుంది.వెంక‌టేశ్వ‌ర‌స్వామి మొద‌టి భార్య కుమారుడు వెంక‌టాద్రి స్వామిని వారసుడిగా పీఠాధిప‌తులు ప్ర‌క‌టించ‌డంతో వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.పీఠాధిప‌తి వివాదంపై వెంక‌టేశ్వ‌ర‌స్వామి రెండ‌వ భార్య మారుతి మ‌హాల‌క్ష్మీ డీజీపీకి ఫిర్యాదు చేసింది. మొద‌టి భార్య కుమారుడు వెంక‌టాద్రి స్వామి,మ‌రికొంత మందితో చేతులు క‌లిపి త‌మ కుటుంబంపై త‌రుచూ దాడుల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంక‌టాద్రిస్వామి కుట్ర చేసిన‌ట్లు త‌న ద‌గ్గ‌ర ఆడియో సంభాష‌ణ ఉంద‌ని ఆమె తెలిపారు.త‌న కుమారుడు గోవింద స్వామి మైనార్టీ తీరేవ‌ర‌కు త‌మ‌ను తాత్కాలిక పీఠాధిప‌తిగా నియ‌మించే వీలునామా ద్వారా ఆమోదించాల‌ని మ‌హాల‌క్ష్మీ దేవాదాయ శాఖ అధికారుల‌ను కోరారు.మైన‌ర్టీ పేరుతో త‌న కుటుంబానికి పీఠం ద‌క్క‌కుండా కొంత‌మంది పీఠాధిప‌తులు చ‌ర్చ‌లు జరుపుతున్నార‌ని ఆమె ఆరోపించారు.పీఠాధిప‌తులు జ‌రిపిన చ‌ర్చ‌ల‌కు త‌మ‌ను బ‌ల‌వంతం చేశార‌ని...ఆ చ‌ర్చ‌ల్లో తాము అయిష్టంగానే పాల్గొన్నామ‌ని తెలిపారు.

వీర‌భోగ వ‌సంత వెంక‌టేశ్వ‌ర‌స్వామి వార‌సుడు ఎవ‌ర‌నేదాని ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతంది. బ్ర‌హ్మం గారి మ‌ఠం పీఠాధిప‌తిని నిర్ణ‌యించ‌డానికి శైవ‌క్షేత్ర పీఠాధిప‌తి శివ‌స్వామితో పాటు మ‌రికొంత‌మంది పీఠాధిప‌తులు అక్క‌డి వెళ్లారు.అయితే అక్క‌డ మొద‌టి భార్య కుమారుడు వెంక‌టాద్రి స్వామిని పీఠాధిప‌తిగా నియ‌మించాల‌ని వీరంతా సూచించారు.అయితే దీనిని విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. బ్ర‌హ్మంగారి మ‌ఠం పీఠాధిప‌తిగా రెండ‌వ భార్య కుమారుడు గోవింద‌స్వామినే నియ‌మించాల‌ని..వీలునామా ప్ర‌కారం గోవింద స్వామి పీఠాధిప‌తి అని విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే అలేఖ్య శ‌ర్మ పేరుతో విడుద‌లైన ఆడియో ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతుంది. బ్ర‌హ్మంగారి మ‌ఠం పీఠాధిప‌తి ఎంపిక నిర్ణ‌యం త‌ప్ప‌యితే ఎంపిక  చేసిన వారు త‌ల‌పగిలి చ‌నిపోతారంటూ ఆడియోలో ఉంది.మొద‌టి భార్య కుమారుడు వెంక‌టాద్రి స్వామిని పీఠాధిప‌తిగా చేయ‌ల‌నేది అలేఖ్య శ‌ర్మా ఆడియో సారాంశంగా ఉంది.అయితే ఈ నిర్ణ‌యాన్ని మాత్రం విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండ‌టంతో పీఠాధిప‌తులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.













మరింత సమాచారం తెలుసుకోండి: