భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్వహించే ఐపీఎల్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ప్రతి ఏడాది వేసవిలో అసలు సిసలైన క్రికెట్ మజా ని ప్రేక్షకులకు అందిస్తు ఫుల్ టైం ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది ఐపీఎల్. అయితే అప్పటి వరకు భారత జట్టులో సహచరులుగా ఉన్న ఆటగాళ్లు అందరు కూడా ప్రత్యర్థులుగా మారిపోయి ఐపీఎల్లో హోరాహోరీగా తడబడుతూ ఉంటారు. అంతే కాదు ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళ్లు సహచరులుగా మారిపోయి ఒక జట్టుగా పోరాడుతూ ఉండడంతో క్రికెట్ మజా మరింత పెరిగి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ నిర్వహించేందుకు అటు బీసీసీఐ కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆయా ఫ్రాంచైజీలు.. తమతో ఉంచుకునే ఆటగాళ్ల జాబితా తో పాటు.. వదులుకునే ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించాలని ఇప్పటికే బిసిసిఐ కోరింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది యువ  ఆటగాళ్లతో జట్టును  బలోపేతం చేసుకోవాలి అని భావిస్తున్న ఐపిఎల్ ఫ్రాంచైజీలు...  కీలక నిర్ణయాలు తీసుకుంటు  ఎంతో మంది సీనియర్ ఆటగాళ్ల కు భారీ షాక్ ఇస్తున్నాయి అనే చెప్పాలి.


 ఈ క్రమంలోనే గత ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లో పేలవ ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న దినేష్ కార్తీక్ సహా మరికొంత మంది ఆటగాళ్లను కోల్కతా జట్టు వదిలేసేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా నిలిచిన కోల్కతా జట్టు ఏకంగా..  మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్, కుల్దీప్ యాదవ్ లను వదిలేయాలని నిర్ణయించుకున్న ట్లు తెలుస్తోంది అంతే కాకుండా..  సునీల్ నరైన్.. రస్సెల్,  కమ్మిన్స్  లను కూడా కోల్కతా జట్టు ఐపీఎల్ సీజన్ లో జట్టు నుంచి వదిలేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: