భారత అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలంపిక్స్ లో  బంగారు పతకం గెలిచి భారత మువ్వన్నెల జెండాని అంతర్జాతీయ గడ్డపై రెపరెపలాడించారు. దీంతో 13 సంవత్సరాల తర్వాత  భారత జాతీయ గీతాన్ని ఒలంపిక్స్ లో వినిపించాడు. 2008 వ సంవత్సరం  ఒలంపిక్స్ లో అభినవ్ బింద్రా  పురుషుల విభాగంలో  10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో స్వర్ణ పతకం సాధించిన సందర్భంగా భారత జాతీయ గీతాన్ని ఆల పించగా, మళ్లీ ఇన్ని సంవత్సరాలకు నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో ఒలంపిక్స్ లో గీతాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది. ఇక మొదటి ప్రయత్నంలోనే  చోప్రా జావెలిన్  ను 80.3 మీటర్లు విసిరాడు. రెండోసారి మాత్రం  87.58 మీటర్లు విసిరాడు. ఇవి గాక రెండవ స్థానంలో ఈ రిపబ్లిక్ చెందిన వెడ్లీక్ నిలిచారు. ఈయన గరిష్టం 86.67 మీటర్లు జావెలిన్ ను విసిరాడు.

అంతేకాకుండా  చెక్ రిపబ్లిక్ చెందినటువంటి వితేజ్ స్లావ్ వెస్లీ  మూడవ స్థానంలో నిలిచాడు. ఆయన గరిష్ఠంగా  85.44 మీటర్లు జావెలిన్ విసిరాడు. ఈ ఒక్క సన్నివేశం మొత్తం అథ్లెటిక్  అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ షేర్ గంట సమయంలోనే  లక్షకు పైగా నెటిజన్లు వీక్షించారు. అంతేకాకుండా  నీరజ్ చోప్రాకు కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నో అభి నందనలు వచ్చాయి. ఈ సందర్భంలో  తెలంగాణ రాష్ట్ర  స్పోర్ట్స్ అతారిటి చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.  ఈ విధంగా  నీరజ్ చోప్రా  టోక్యో ఒలంపిక్స్ బంగారు పతకం సాధించి భారత  జాతీయ జెండాను రెపరెపలాడించాడమే కాకుండా 13 సంవత్సరాల నిరీక్షణకు తెర దించారు. దీంతో భారతదేశం మొత్తం బంగారు పతకం సాధన ఆనందంలో నీరజ్ చోప్రాను ఆకాశానికి ఎత్తింది.

మనదేశానికి పేరు తెచ్చిన  చోప్రా నిలువెత్తు బంగారం అని, ఆయన ఈ ఘనత సాధించడం దేశానికి గర్వకారణమని, స్వర్ణం కోసం ఎదురు చూస్తూనటువంటి భారత్ కు 23 సంవత్సరాల నీరజ్ చోప్రా ఈ పథకాన్ని అందించడం  అభినందనీయమని చిన్నాపెద్ద ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా నీరజ్ ను అభినందనలతో పూల వర్షం కురిపించారు అని చెప్పవచ్చు. చోప్రా సాధించి నటువంటి ఘనతను ప్రధాని నరేంద్ర మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు  ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్నో రోజుల నుంచి బంగారు పతకం  కోసం ఎదురు చూస్తున్న  భారత్ కు చోప్రా బంగారు పతకం సాధించి  భారతదేశ కీర్తిని  ఆకాశానికి ఎత్తాడు అని  చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: