ఐపీఎల్ మెగా వేలం గురించి ఇప్పుడు కాదు ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇక ఈ మెగా వేలం లో ఎవరికి ఎక్కువ ధర పలకబోతుందా అన్నదానిపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా కొన్ని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో అంచనాలు మొత్తం తారుమారవుతున్నాయ్. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ కి మెగా వేలంలో భారీ డిమాండ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు డేవిడ్ వార్నర్. స్టార్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుండి నడిపించాడు  అంతకు మించి అతను ఒక గొప్ప బ్యాట్స్మన్ కూడా.


 ఐపీఎల్లో పసికూన గా ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ కు ఒక సారి టైటిల్ విజేత గా కూడా నిలిపాడు. అలాంటి డేవిడ్ వార్నర్ కు గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. మొదట కెప్టెన్సీ నుంచి తప్పించిన జట్టు యజమాని ఆ తర్వాత జట్టు నుంచి కూడా తప్పించింది. దీంతో డేవిడ్ వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నాయని అర్థమైంది. చివరికి ఇటీవలే రిటైన్ చేసుకోకుండా మెగా వేలంలో కి వదిలేసింది. దీంతో అతని కోసం మెగా వేలంలో పోటీ తీవ్రంగా ఉంటుందని అందరికంటే ఎక్కువ ధర పలుకుతాడు అని అనుకున్నారు అందరు.


 కానీ ఊహించని రీతిలో డేవిడ్ వార్నర్ వైపు మాత్రం ఎక్కువగా ఎవరూ ఆసక్తి చూపించలేదు అని తెలుస్తోంది. అయితే గత ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున 12 కోట్ల ధర పలికాడు డేవిడ్ వార్నర్. కానీ ఈ సారి మాత్రం కేవలం 6.2 కోట్లు మాత్రమే డేవిడ్ వార్నర్ పలకడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వేలంలో ఇతని కోసం సాదాసీదా పోటీ జరిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్ అతని 6.25 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ఊహించని రేంజిలో అటు డేవిడ్ వార్నర్ అభిమానులందరికీ కూడా షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: