భారత క్రికెట్ లోకి ధోని వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఇక తన ఆటతీరుతో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. 24 ఏళ్లకే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు రిషబ్ పంత్. ఇక ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 3 ఫార్మాట్ లలో కూడా టీమిండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు రిషబ్ పంత్. మరికొన్ని రోజుల్లో రిషబ్ పంత్ టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రిషబ్ పంత్ ఐపీఎల్లో ఏకంగా ఒక జట్టు కెప్టెన్ గా మారిపోయాడు.



 గత ఏడాది ఢిల్లీ జట్టు కెప్టెన్సీ చేపట్టిన  రిషబ్ పంత్ ఇక తనదైన  కెప్టెన్సీ తో జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. ఈసారి కూడా సరికొత్త ఆటగాళ్లు జట్టులోకి చేరిపోయిన నేపథ్యంలో రిషబ్ తనదైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక ఈసారి కప్పు కొట్టడం పక్క అని ఢిల్లీ అభిమానులు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. తాజాగా ఢిల్లీ కాపిటల్స్ కాపిటల్ రిషబ్ పంత్ పై ఢిల్లీ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషబ్ పంత్ హెడ్ కోచ్ రికీపాంటింగ్ కోచింగ్ లో మరింత రాటు తేలాడు అంటూ చెప్పుకొచ్చాడు షేన్ వాట్సన్.


 24 ఏళ్ల వయసులోనే రిషబ్ పంత్ ఎన్నో అపురూప ఘనతలు సాధించాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తనలో ఉన్న లోపాలు ఏంటో గుర్తిస్తూ ఇక వాటిని అధిగమిస్తూ రోజురోజుకీ రిషబ్ పంత్ రాటుదేలుతున్నాడు అంటూ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిషబ్ పంత్ ఒక ఆటగాడిగా ఒక కెప్టెన్గా మెరుగ్గా రాణించడం ఎంతో ముఖ్యం అంటూ వ్యాఖ్యానించాడు. కాగా అనూహ్యంగా రిషబ్ పంత్ ఏకంగా శ్రేయస్ అయ్యర్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: