క్రికెటర్లకు సినీ సెలబ్రిటీలకు మధ్య ప్రేమాయణం నడవడం ఇప్పటినుంచి కాదు ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్న ట్రెండ్ అన్న విషయం తెలిసిందే. ఇలా ఎంతోమంది  హీరోయిన్లను ప్రేమించిన క్రికెటర్లు కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన తర్వాత పెళ్లి చేసుకున్న వారు కొంతమంది అయితే.  కేవలం ప్రేమతో సరిపెట్టుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న వారు మరికొంతమంది. ఈ క్రమంలోనే బిసిసిఐ అధ్యక్షుడు టీమిండియా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఓ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయాడు అన్న విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పటి అందాల తార నగ్మా.. 1999 వరల్డ్ కప్ సమయంలో వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. తర్వాత కొన్నాళ్ళకి ప్రేమలో పడ్డారు. సౌరవ్ గంగూలీ కి అప్పటికే డోనా తో పెళ్లయింది. ఆమె సౌరవ్ గంగూలీ  చిన్ననాటి స్నేహితురాలు కావడం గమనార్హం. అయినప్పటికీ ఇక నగ్మా తో గంగూలి ప్రేమలో మునిగి తేలాడు  ఇక వీరిద్దరి ప్రేమ  గురించి మీడియాలో వచ్చిన వార్తలు అన్నీ ఇన్ని కావు. అయితే గంగూలీ భార్య డోనా మాత్రం ఈ వార్తలను కొన్నాళ్లపాటు పట్టించుకోలేదు. ఒకసారి గంగూలి నగ్మా తిరుపతి వెళ్లారు. అక్కడ ఓ విలేకరి వారిద్దరి ఫోటో తీసి పత్రికలో వేసింది.


 ఇంకేముంది వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ మీడియా ప్రచారం చేయడం మొదలైంది. ఈ ఫోటో చూసిన తర్వాత గంగూలి భార్య డోనా మనసు ముక్కలైంది.  ఈ క్రమంలోనే  గంగూలీతో తాడోపేడో తేల్చుకోవాలని భావించింది. భర్తను పిలిచి ఇక మీడియా సమావేశంలో ఇవన్నీ రూమర్స్ అని చెప్పు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.  ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతినీ మోసం చేసినట్లు గ్రహించిన గంగూలీ మీడియా సమావేశంలో నగ్మా తో ఎలాంటి సంబంధం లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో మరో వైపు నగ్మా మనసు ముక్కలు అయింది. చివరికి అతనికి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పటికీ నగ్మా పెళ్లి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: