ప్రస్తుతం మహిళల హాకీ ప్రపంచ కప్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ప్రపంచ కప్ లో భాగంగా భారత మహిళల హాకీ జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. అయితే మొన్నటికి మొన్న జరిగిన పురుషుల హాకీ ప్రపంచ కప్లో భారత జట్టు నిరాశపరిచింది. కానీ ఇప్పుడు మాత్రం మహిళల జట్టు  బాగా రాణిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందరు. ఇలాంటి సమయంలోనే ప్రపంచకప్లో భాగంగా మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టుతో ఆడగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో రెండు జట్లకి  ఒక్కో పాయింట్ తో వచ్చింది. ఇక ఆ తర్వాత రెండో మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడగా ఇక ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగియడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక టీమ్ ఇండియా హాకీ మహిళల జట్టు వరల్డ్కప్లో కొనసాగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 ఈ క్రమంలోనే స్పెయిన్ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఆతిథ్య స్పెయిన్ లో జరిగిన కీలకమైన మ్యాచ్లలో సవిత పూనియా నేతృత్వంలోని టీమిండియా మరోసారి తల బడింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో పరాజయం పాలైంది టీమిండియా. తద్వారా క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టకుండానే టోర్నీ నుంచి టీమిండియా మహిళల జట్టు వెనుదిరిగింది అని చెప్పాలి. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత అమ్మాయిలు చివరి నిమిషం వరకు వీరోచిత పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


 అయితే ఒకానొక సమయంలో ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసె అవకాశముంది అన్నట్లుగానే కనిపించింది. కాని మరికాసేపట్లో మ్యాచ్ ముగుస్తుంది అనుకుంటున్న సమయంలో  స్పెయిన్ ఒక గోల్ చేయడంతో  గెలిపించింది. ఇక ఈ విజయంతో స్పెయిన్, న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా ఇంగ్లాండు జట్లు క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టాయి అని చెప్పాలి. క్వార్టర్ ఫైనల్స్ నేటినుంచే  నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాగా ఏడాది మహిళల ప్రపంచ కప్ లో విశ్వవిజేతగా నిలబడే జట్టు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: