మినీ ప్రపంచ కప్ గా పిలవబడే ఆసియా కప్ మరికొన్ని రోజుల్లో జరగబోతుంది అనే విషయం తెలిసిందే . శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా అక్కడ రాజకీయ అనిశ్చితి కారణంగా చివరికి శ్రీలంక క్రికెట్ బోర్డు యూఏఈ వేదికగా ఆసియా కప్ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆసియా కప్లో పాల్గొనే జట్లు యూఏఈ చేరుకుని అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆసియా కప్ టైటిల్  విజేతగా నిలవడమే లక్ష్యంగా ప్రతి జట్టు బరిలోకి దిగేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంది అని చెప్పాలి.


 ఇకపోతే ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఆసియా కప్ లో ఏ జట్టు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది.. ఇక విజేతగా నిలిచిన జట్టు ఏది అన్న విషయాలపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు ఇటీవలి కాలం లో హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. కాగా ఆసియా కప్ విజేత ఎవరు అనే విషయం పై ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షైన్ వాట్సన్ స్పందించాడు. ఈ క్రమంలోనే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.


 ఆసియా కప్ 2022 లో భారత జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుంది అంటూ ఆసీస్ మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ జోస్యం చెప్పాడు. టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉంది అంటూ పేర్కొన్నాడు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆడే సత్తా భారత్కు ఉంది అంటూ తెలిపాడు. అయితే గతంలో ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్..భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో గెలిచిన జట్టు ఏదైతే ఉంటుందో ఇక అదే జట్టు ఆసియా కప్ విజేతగా కూడా నిలుస్తుంది అంటూ తెలిపాడు. కాగా టీమిండియా మునుపెన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుండడంతో ఈసారి కప్పు కొట్టడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: