ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ను ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటే టీవీ ముందు కూర్చుని ఎంజాయ్ చేయడమే కాదు కాస్త సమయం దొరికిందంటే చాలు మైదానంలో అడుగుపెట్టి క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెటర్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఎంత జాగ్రత్తతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఒంటిపై బంతి ఎక్కడ తగిలిన గాయం కాకుండా ఉండేందుకు ప్యాడ్స్ ధరిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు మాత్రం గాయాలు అవుతూ ఉంటాయి. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మెడపై బంతి బలంగా తాకడంతో మైదానంలో కుప్పకూలిపోయాడు. కాసేపటికి చివరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు.అందుకే క్రికెటర్లు ఇక బంతి వేగంగా తమ శరీరానికి తగలకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కి కొద్దిలో ప్రమాదం తప్పింది.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. టీ20 ప్రపంచ కప్ ముందు ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ఆడుతుంది. అయితే ఇటీవల  తొలి టి20 మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఇన్నింగ్స్ 14 ఓవర్లో డేనియల్ సామ్స్ మొదటి బంతిని స్లో డెలివరీ వేశాడు. దీంతో మిడ్ ఆఫ్ లో షాట్ కొట్టిన స్టోక్స్ రెండు పరుగులు తీశాడు. ఇక తర్వాత బంతి కూడా స్లో డెలివరీ అని అనుకున్నాడు స్టోక్స్. రివర్స్ స్వీప్ పాడేందుకు ప్రయత్నించాడు. కానీ ఈసారి మాత్రం బౌలర్ గుడ్ లెంత్ బంతిని ఎంతో వేగంగా వేశాడు.  ఈ క్రమంలోనే అతని బ్యాట్కు కనెక్ట్ అవ్వలేదు. అంతేకాదు హెల్మెట్ దిగువన ఉన్న భాగంలో బంతి బలంగా తగిలింది.. ఇప్పటికే అప్రమత్తమైన బెన్ స్టోక్స్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ లాభం లేకుండా పోయింది. బంతి తగిలినవేగానికి ఎగిరి కింద పడ్డాడు. ఎలాంటి గాయం కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: