ఇటీవల కాలంలో భారత క్రికెట్లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ఒక్కసారిగా గుర్తింపు సంపాదించుకున్నాడు కాశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. ఇక ఐపీఎల్ లో సన్రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగంగా బంతులు సంధించడం చూసి టీమిండియా కు ఒక ఆణిముత్యం లాంటి బౌలర్ దొరికాడు అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ వేసే బౌలర్ దొరకడం చాలా అరుదు అంటూ వ్యాఖ్యానించారూ.


 ఈ క్రమంలోనే తన బౌలింగ్ వేగంతో సెలెక్టర్ల దృష్టిని కూడా ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్ తక్కువ సమయంలోనే టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. అటు టీమిండియా తరఫున కూడా అదే వేగాన్ని కొనసాగించాడు. కానీ బంతి వేగంతో అయితే వేస్తున్నాడు కానీ సరైన లైన్ అండ్ లెంత్ లేకపోవడంతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో జట్టలో స్థానం కోల్పోయాడు. ఇక అతను తప్పకుండా వరల్డ్ కప్ ఆడుతాడు అనుకున్నప్పటికీ చివరికి ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్నాడు ఉమ్రాన్ మాలిక్.


 తనను వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయలేదు అన్న కోపమో.. ఇంకేంటో తెలియదు కానీ ఇటీవల ఉమ్రాన్ మాలిక్ ఏకంగా వికెట్ ఎగిరిపడే విధంగా యార్కర్ తో విరుచుకుపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. 150 కిలోమీటర్ల స్పీడుతో దూసుకు వెళ్లిన బంతి మిడిల్ స్టంప్ ని ఎగరగొట్టడమే కాదు వికెట్ను పిచ్ బయటికి పడేలా చేసింది. ఈ వీడియోని సన్రైజర్స్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంది. జమ్ము కాశ్మీర్, మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో నాలుగో ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన ఇమ్రాన్ మాలిక్ నాలుగు వికెట్లు తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: