ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ కొన్ని రకాల క్రీడలకు మాత్రం ఊహించనీ రీతిలో  పాపులారిటీ ఉంది అని చెప్పాలి. ఇక ఇలా ప్రపంచవ్యాప్తంగా ఊహకందని  పాపులారిటీ సంపాదించుకున్న క్రీడ ఏదైనా ఉంది అంటే అది ఫుట్ బాల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక క్రీడాభిమానులు అందరూ కూడా ఫుట్ బాల్ ఆటని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ప్రపంచంలోని నలమూలలో ఉండే చిన్న చిన్న దేశాల్లో సైతం ఫుట్ బాల్ పాపులారిటీ పాకిపోయింది అని చెప్పాలి.  అయితే ఎంతోమంది అభిమానులు  ఎదురు చూస్తున్న ఫుట్ బాల్ ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం అయింది.


 అయితే ఖతార్ వేదికగా జరుగుతున్న ఇక ఈ వరల్డ్ కప్ ను చూసేందుకు ప్రపంచ క్రీడాభిమానులు అందరూ కూడా తరలి వెళ్తున్నారు. మరి కొంతమంది స్నేహితులతో కలిసి టీవీల ముందు కూర్చొని మ్యాచ్ వీక్షించాలని నిర్ణయించుకున్నారు.. అయితే ఇక తమకు ఇష్టమైన క్రీడను ఏకంగా స్నేహితులందరూ గుంపుగా చేరి ఒకే చోట టీవీలో వీక్షిస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే ఇలాంటి ఆలోచన చేసిన ఫుట్ బాల్ అభిమానులు ఎవరు చేయని పనిని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు అని చెప్పాలి. మన దేశంలో ఫుట్ బాల్ కి ఎంత క్రేజ్ ఉంది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇప్పుడు జరిగిన ఘటన కూడా ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. ముఖ్యంగా ఫుట్బాల్ ఫాన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా  మారిన కేరళలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇప్పటికే మల్లాపురం సహా పలు ప్రాంతాల్లో మెస్సి, నైమర్ లాంటి ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ల కటౌట్ లు పెట్టి హంగామా చేయగా.. ఇటీవలే కోచి జిల్లాలోని ముండకముకల్ గ్రామంలో ఫ్యాన్స్ ఏకంగా ఒక ఇంటిని కొనుగోలు చేశారు. 17 మంది కలిసి మ్యాచ్లు చూసి అసలైన కిక్ పొందేందుకు ఏకంగా 23 లక్షలు ఖర్చు చేసి ఒక ఇంటిని కొనుగోలు చేయడం గమనార్హం. అంతే కాదు ఈ ఇంటికి బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ దేశాల జట్ల ఆటగాళ్ల జెర్సీ రంగులను వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: