ప్రతిష్టాత్మకమైన దేశవళి టోర్ని అయిన విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుతం ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ప్రతి ఆటగాడు కూడా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతూ.. తమ ప్రతిభ ఏంటో నిరూపించుకునే పనిలో నిమగ్నం అయిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవైపు బౌలర్లు వరుసగా వికెట్లు పడగొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటే.. మరోవైపు బ్యాట్స్మెన్లు ఏకంగా సెంచరీలతో చెలరేగిపోతూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు.


 ఇక ప్రస్తుతం విజయ హజారే ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్లలో తప్పకుండా ఎవరో ఒక ఆటగాడు సెంచరీ తో చలరేగిపోవడం ప్రతిరోజు జరుగుతూనే ఉంది అని చెప్పాలి. ఇక కొంతమంది అయితే మెరుపు ఇన్నింగ్స్ ఆడి బౌలర్ల పై వీర విహారం చేసి సెంచరీలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక ఇటీవల విజయ్ హాజరే ట్రోఫీలో భాగంగా మరో సంచలనం నమోదయింది అని చెప్పాలి. ఏకంగా ఒకేరోజు 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదు కావడం గమనార్హం .


 ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులు అందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా ఆటగాళ్లందరూ కూడా సంచలనం సృష్టించారు. పరుగుల వరద పారించారు.  విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఒకేరోజు 18 మ్యాచ్లు జరిగాయి అని చెప్పాలి. ఇక ఇందులో నారాయణ జగదీషన్ డబుల్ సెంచరీ తో పాటు మరో 14 మంది బ్యాట్స్మెన్లు సెంచరీలు చేశారు. మొత్తంగా ఇలా ఒకేరోజు 15 సెంచరీలు నమోదు అయ్యాయి. ఇక వీరిలో హైదరాబాద్ ఆటగాడు రోహిత్ నాయుడు తో పాటు రికీ బోయి, యాష్ దూబే, కార్తీక్ బిశ్వాల్, విక్రం సింగ్, రాహుల్ త్రిపాటి, సుదీప్ గరాని సహా తదితరులు ఉన్నారు. అదే సమయంలో మరో 36 మంది ప్లేయర్లు హాఫ్ సెంచరీ లతో అదరగొట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: