ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈసారి వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఎన్నో చాంపియన్ జట్లకు ఊహించిన షాక్ లు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. వరుసగా విజయాలు సాధించి ఇక వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా దూసుకుపోతాయి అనుకుంటే ఛాంపియన్ జట్లు ఓటమి చవిచూస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ లో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న అర్జెంటీనాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాదాపు గత 36 మ్యాచులుగా ఓటమి ఎరుగని  జట్టుగా దూసుకు వచ్చిన అర్జెంటీనాకు అటు సౌదీ అరేబియా బ్రేకులు వేసింది అని చెప్పాలి.


 టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన మెస్సి టీం 1-2 తేడాతో సౌదీ అరేబియా చేతిలో పరాజయం పాలయింది. ఒక్క ఓటమి అంత తారుమారు చేస్తుందనటానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి. అయితే స్టార్ ప్లేయర్ లీయోనల్ మెస్సి కి ఇదే చివరి వరల్డ్ కప్ అని అభిమానులు భావిస్తున్నారు.  ఇలాంటి సమయంలో వరల్డ్ కప్ గెలిస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. అయితే అర్జెంటిన మొదటి మ్యాచ్లో ఓడిపోయింది. ఆ తర్వాత వరల్డ్ కప్ లో నిలవాలంటే అన్ని మ్యాచ్లలో చెమటోడ్చాల్సి ఉంది.



 అదృష్టం కొద్దీ అర్జెంటీనా ఉన్న గ్రూప్ సిలో జరిగిన పోలాండ్, మెక్సికో మ్యాచ్ గోల్ లేకుండానే డ్రా గా ముగిసింది. దీంతో ఇరు జట్లకు కూడా ఒక్కో పాయింట్ పంచుకున్నాయి.  అయితే ప్రస్తుతం గ్రూప్ సి లో మూడు పాయింట్లు సౌదీ అరేబియా టాప్ లో ఉంది. ఇక మెక్సికో,  పోలాండ్ తర్వాత స్థానంలో అర్జెంటీనా పాయింట్లు లేకుండా చివరి స్థానంలో ఉంది. ఒకవేళ అర్జెంటీనా  ఇతర టీమ్స్ పై ఆధారపడకుండా ఫ్రీ క్వార్టర్స్ కు వెళ్లాలంటే మాత్రం రెండు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాలి. అలా జరిగితే అర్జెంటినాకు ఆరు పాయింట్లు వస్తాయి. ఇక ఒక మ్యాచ్ డ్రా అయినా కూడా మిగతా జట్ల జయాపజాలపై అర్జెంటీనా భావితవ్యం ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: