గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా టీమిండియా బౌలింగ్ ఎంతో బలహీనంగా కనిపిస్తూ ఉండడం.. కనీస పోటీ ఇవ్వకుండా ఏకంగా భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండటం చూస్తూ ఉంటే మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా బౌలింగ్ విభాగం చేతులెత్తేయడంతోనే కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది టీమిండియా.


 రానున్న రోజుల్లో టీమ్ ఇండియా బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక జట్టులో ఆల్రౌండర్ల కొరత కూడా వేధిస్తూ ఉంది. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ల కంటే ఆల్రౌండర్లు జట్టులో ఎక్కువ మంది ఉండడమే మంచిది అంటూ అభిప్రాయపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. బ్యాట్స్మెన్లు సైతం బౌలింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చెబుతున్నారు. ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 జట్టులో బౌలింగ్ త్రోడౌన్ స్పెషలిస్టులు ఉండడం సమస్యగా మారింది. వాళ్లు ఉన్నారనే ధీమాతో బ్యాట్స్మెన్లు నెట్స్ లో బౌలింగ్ పై సాధన చేయడం పూర్తిగా మానేస్తున్నారు. ఇది జట్టు లో పార్ట్ టైం బౌలర్ల కొరతను సృష్టిస్తుంది అంటూ  జాఫర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత జట్టులో తీవ్రమైన ఆల్రౌండర్ల కొరత ఉందని.. ఇక ఉన్నవారిని టాప్ ఆర్డర్ లో పంపడానికి తొందర పడుతున్నారు అంటూ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో వైఫల్యం కారణంగా అటు బీసీ సీఐ కూడా రానున్న రోజుల్లో ఆల్ రౌండర్ల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl