ఇటీవల విజయ హాజరే ట్రోఫీలో భాగంగా మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ఆటగాడు రుతురాజు గైక్వాడ్ అద్భుతమైన రికార్డును సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా 6 బంతుల్లో 7 సిక్సర్లు కొట్టి అదరగొట్టాడు రుతురాజు. మధ్యలో ఒక నోబాల్ రావడంతో ఇక ఆ బంతిని కూడా వినియోగించుకుని సిక్సర్ గా మలిచాడు.  తద్వారా ఆరు బంతుల్లో 7 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఒక  రేర్ రికార్డును క్రియేట్ చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పేరు కాస్త ప్రస్తుతం మారుమోగిపోతుంది.


 ఇప్పటికే వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న రుృతరాజు గైక్వాడ్ ఇక ఇప్పుడు సిక్సర్లతో కూడా అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఓకే ఓవర్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లుగా ఎవరు కొనసాగుతున్నారు అన్న విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అందరూ ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఋతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్లు కొట్టగా.. ఇక ఒకే ఓవర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు మాత్రం మరొకరి పేరిట ఉంది అని చెప్పాలి. ఒకే ఓవర్ లో 8 సిక్సర్లు కొట్టిన రికార్డు 1990లో నమోదయింది.


 న్యూజిలాండ్ లోని కాంటర్ బురి కీపర్ లీ జర్మోన్ వెల్డింగ్టన్ బౌలర్ బెర్త్ వాన్స్ ఓవర్లో ఏకంగా 8 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు.. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు అని చెప్పాలి. అయితే ఇక ఆ ఓవర్లో బౌలర్ బెర్త్ వాన్స్ ఏకంగా 22 బంతులు వేశాడు. ఇందులో 17 నోబాల్స్ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఈ ఓవర్ ని ఎంతగానో సద్వినియోగం చేసుకున్న బ్యాట్స్మెన్ ఏకంగా ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఒకే ఓవర్లో నోబాల్స్ కారణంగా 22 బంతులు వేయడంతో అంపైర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏకంగా ఐదు బంతులకే ఓవర్ అని ప్రకటించేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: