ఒకప్పుడు క్రికెట్లో కొనసాగుతున్న ఆటగాళ్లు ఇక ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై విమర్శలు చేయడం విషయంలో కాస్త వెనకడుగు వేసేవారు అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా క్రికెట్ బోర్డు పెద్దలపై విమర్శలు చేస్తే తమ కెరియర్కే ప్రమాదం ఏర్పడుతుందని భయపడుతూ ఉండేవారు. అయితే ఇలా ఎవరైనా ఇక కాస్త ధైర్యం తెచ్చుకొని విమర్శలు చేసిన ఇక ఆ తర్వాత కాలంలో వారికి జట్టులో అవకాశాలు లేకపోవడం కూడా ఎన్నోసార్లు గతంలో చూశాము. కానీ ఇప్పుడు మాత్రం ఎంతోమంది స్టార్ క్రికెటర్లు అటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులపైనే కాదు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పైన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 ఇటీవల కాలంలో ఎంతోమంది క్రికెటర్లు నిర్విరామంగా క్రికెట్ ఆడుతూ అలసిపోతున్న నేపథ్యంలో కేవలం కొన్ని ఫార్మాట్లకు మాత్రమే పరిమితం అవుతూ మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఐసీసీ షెడ్యూల్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇలా ఐసీసీ షెడ్యూల్ పై విమర్శలు చేస్తున్న వారిలో ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ కూడా చేరిపోయాడు అని చెప్పాలి. ఇటీవల కాలంలో  దేశవాళీ టి20 లీగ్ లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్ ను ప్రమాదంలోకి పడుతుంది అంటూ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.




 అంతేకాదు ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు అని చెప్పాలి.. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ రూపకల్పనపై ఐసీసీ ఎందుకో శ్రద్ధ చూపడం లేదు అన్నట్లుగా అనిపిస్తుందని విమర్శలు గుర్తించాడు ఇంగ్లాండు టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్. టి20 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా తో ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ చేయడం లో అసలు అర్థమే లేదు అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఫలితం గురించి ఆలోచించడం మానేసి.. వినోదం మీద దృష్టి పెడితే రానున్న రోజుల్లో టెస్ట్ ఫార్మాట్ కు ఆదరణ పెరుగుతుంది అంటూ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: