సాధారణంగా సాధారణంగా క్రికెట్ లో ఎంతటి స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఐసీసీ రూల్స్ ను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎవరైనా ఆటగాడు ఐసిసి రూల్స్ ని బ్రేక్ చేశాడు అంటే ఇక వారికి జరిమానా విధించడం లేదా నిషేధం విధించడం లాంటిది కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఇక స్టార్ క్రికెటర్లు అటు మైదానంలో ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ ఐసీసీ రూల్స్ ని అతిక్రమించడానికి మాత్రం అస్సలు ధైర్యం చేయరు. కానీ కొంతమంది స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్న వారు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఇక కొన్ని కొన్ని సార్లు నిబంధనలు అతిక్రమించి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ సైతం ప్రస్తుతం ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసి వార్తలో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య మొదలైన తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా ఇలా రిజ్వాన్ రూల్స్ బ్రేక్ చేయడం గమనార్హం. జ్వరం కారణంగా బాబర్ అజం మూడో రోజు మైదానంలోకి రాలేదు. దీంతో బాబర్  స్థానంలో స్టాండింగ్ కెప్టెన్గా సీనియర్ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించాడు. అయితే బాబర్ స్థానంలో మహమ్మద్ రిజ్వాన్ సబ్స్టి ట్యూట్ ప్లేయర్గా మైదానంలోకి అడుగు పెట్టాడు.


 ఈ క్రమంలోనే ఒకవైపు స్టాండింగ్ కెప్టెన్గా సర్ఫరాజ్  అహ్మద్ ఉన్నప్పటికీ కూడా అటు సబ్స్టిట్యూట్  ప్లేయర్ గా వచ్చిన మహమ్మద్ రిజ్వాన్ మాత్రం ఏకంగా మ్యాచ్లో పలుమార్లు ఆటగాళ్లను ఫీల్డింగ్ మారుస్తూ కెప్టెన్గా వ్యవహరించడం గమనార్హం. వాస్తవానికి మొహమ్మద్ రిజ్వాన్ టెస్టులలో వైస్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ న్యూజిలాండ్తో టెస్ట్ కు మాత్రం రిజ్వాన్ స్థానంలో సీనియర్ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్  జట్టులోకి వచ్చాడు. దీంతో ఒక సాదాసీదా  సబ్స్టిట్యూట్ ప్లేయర్ గానే అటు బాబర్ స్థానంలో జట్టులోకి వచ్చాడు మహమ్మద్ రిజ్వాన్. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం సబ్స్టిట్యూట్  ప్లేయర్ గా వచ్చిన ఆటగాడు కెప్టెన్సీ లేదా బౌలింగ్ చేయకూడదని నిబంధన ఉంది. ఇక ఇదంతా చూసిన తర్వాత మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిబంధనలు గాలికి వదిలేసిందా అనే అనుమానం అందరిలో కలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: