సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు ఎక్కువగా క్రీడా స్ఫూర్తిని కనబరచడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మైదానంలో ప్రత్యర్థులు తప్పు చేసినప్పుడు కూడా ముందుగా హెచ్చరించడం లాంటివి చేసి తమ క్రీడా స్ఫూర్తితో ఏకంగా అభిమానుల మనసులు దోచేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఇలా ఆటగాళ్లలో ఉండే క్రీడా స్పూర్తి వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సాధారణంగా కొంతమంది ఆటగాళ్లు ప్రత్యర్థులతో వివాదాలు పెట్టుకోవడానికి అసలు ఇష్ట పడరు.


 ఏదైనా వివాదం చెలరేగుతుంది  అని తెలిసినప్పుడు సైలెంట్ గా ఉండిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఆటగాళ్లు  సైతం కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థులకు వార్నింగులు ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. కాగా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇలాంటిదే చోటుచేసుకుంది. ఎప్పుడు కూల్ గా కనిపించే ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన డి బ్రెయిన్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్లో వైరల్ గా మారింది.



 ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచుల సిరీస్ లో భాగంగా ఇటీవల రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా ఘోరంగా ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా జట్టు. ఈ క్రమంలోనే ఇటీవల మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండవ టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రెండు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చాడు తెంప బావుమా. మరోవైపు డి బ్రయిన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మిచెల్ స్టార్క్ బౌలింగ్ వేయడానికి రాగ.. బావుమా బ్యాటింగ్ చేస్తుండగా నాన్ స్ట్రైక్ ఎండలో ఉన్న డిబ్రయిన్ స్టార్క్  బౌలింగ్ వెయ్యక ముందే క్రీజు వదిలి బయటకు వెళ్లారు. దీంతో అసహనానికి గురైన స్టార్క్ క్రీజులో ఉండొచ్చు కదా అది అంత కష్టమైన పని కాదు కదా అంటూ ఏకంగా ప్రత్యర్థికి  వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఎప్పుడు కూల్ గా ఉండే  స్టార్కు వార్నింగ్ ఇవ్వడంకు సంబంధించిన వీడియో  చూసి ఫ్రాన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: