గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అని చెప్పాలి. రీ ఎంట్రీ తర్వాత అద్భుతమైన ప్రదర్శన చేసి అదరగొట్టాడు హార్దిక్ పాండ్యా. ఏకంగా ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా కూడా మారిపోయిన హార్థిక్ పాండ్యా ఏకంగా మొదటి ప్రయత్నంలోనే జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత ఇక అటు భారత జట్టు తరఫున కూడా అదే రీతిలో ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూ ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. అంతే కాదు తనలో ఉన్న కెప్టెన్సీ నైపుణ్యాలను కూడా నిరూపించుకుని టీం ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ రైసులో మొదటి స్థానంలోకి వచ్చేసాడు. అయితే మరికొన్ని రోజుల్లో  పాండ్యాను కెప్టెన్ గా మార్చబోతున్నాడు అన్న చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హార్థిక్ పాండ్యా గుజరాత్ కు చెందిన ఆటగాడు కావడంతోనే అతనికి త్వరలో కెప్టెన్సీ కట్టబెట్టబోతున్నారని.. బిజెపి ఈ విషయంలో రాజకీయంగా వ్యూహాలు నడుపుతుంది అంటూ  అక్కడక్కడ టాక్ కూడా వినిపించింది.


 ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే హార్దిక్ పాండ్యా బిజెపి జాతీయ అధ్యక్షుడు హోం మంత్రి అమిత్ షాను కలవడం కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. తన సోదరుడు కృణాల్ పాండ్యాతో కలిసి అమిత్ షాను కలిశారు హార్దిక్ పాండ్యా. అనంతరం ఈ ఫోటోలను హార్థిక్ పాండ్యా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. మమ్మల్ని ఆహ్వానించినందుకు మా కోసం సమయం కేటాయించినందుకు హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు అంటూ హార్దిక్ తెలిపాడు. అయితే ఇంత సడన్గా అమిత్ షా పాండ్యాతో భేటీ ఏంటి అన్నది మాత్రం ఒకసారి కొత్త చర్చకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: