
ఇక ఎలాంటి బౌలర్ తనకు బంతులు విసురుతున్న కూడా ఎక్కడ ఒత్తిడికి గురి కాకుండా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ సొగసైన షాట్లతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల రోజుల వ్యవధిలోనే సెంచరీ డబుల్ సెంచరీ చేసి ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టాడు. న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ తో చెలరేగిపోయిన శుభమన్ గిల్ ఇక ఆ తర్వాత మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇలా తన బ్యాటింగ్ తో ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టడమే కాదు ఇక ఐసీసీ విడుదల చేసే ర్యాంకింగ్స్ లో కూడా ఒక్కసారిగా పైకి దూసుకొచ్చాడు.
ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే బ్యాట్స్మెన్ల ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్ తో సిరీస్లో ఏకంగా సెంచరీ డబుల్ సెంచరీ తో అలరించిన శుభమన్ గిల్ ఒక్కసారిగా ఇరవై స్థానాలు ఏగబాకి ఆరవ స్థానంలో నిలిచాడు అని చెప్పాలి అయితే శుభమన్ గిల్ కెరియర్లో ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ ఒక స్థానం పడిపోయి ఏడవ స్థానానికి చేరుకుంటే రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగుపరచుకొని ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఇక ఎప్పటిలాగానే ఈ లిస్టులో బాబర్ మొదటి స్థానంలో ఉన్నాడు.