
అయితే గత కొంతకాలం నుంచి మాత్రం జోప్రా ఆర్చర్ గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొన్ని నెలల నుంచి ఇంగ్లాండ్ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. గత ఏడాది ఐపీఎల్ లో కూడా ఆడలేదు. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత ఇటీవలే గాయాల నుంచి కోలుకొని మళ్ళీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు అని చెప్పాలి ఈ క్రమంలోనే అతని ప్రదర్శన ఒక రేంజ్ లో ఉంటుందని ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.
అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన వన్డే మ్యాచ్లో మాత్రం రి ఎంట్రీ మ్యాచ్లో ఆర్చర్ నాసిరకం బౌలింగ్ చేశాడు అని చెప్పాలి. 10 ఓవర్లు వేసిన ఆర్చర్ ఏకంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు అని చెప్పాలి. అయితే అర్చర్ వన్డే కెరియర్ లో ఇవి అత్యంత చెత్త గణాంకాలు కావడం గమనార్హం. దాదాపు 678 రోజుల తర్వాత తొలి మ్యాచ్ ఆడిన ఆర్చర్ ఒకే ఓవర్ లో 20 కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇలా ఒక ఓవర్ లో జోప్రా ఆర్చర్ 20 పరుగులు ఇవ్వటం ఇదే తొలిసారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ పై సౌత్ ఆఫ్రికా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.