భారత యువ ఆటగాడు, ఆల్ రౌండర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ గురించి మీకు చాలా విషయాలు తెలియవు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతగాడు ఎక్కడా బాహాటంగా తనగురించి తాను చెప్పుకోలేదు. అయితే ఇపుడు చెప్పబోయే విషయం తెలిస్తే అతగాడిని మీరు మెచ్చుకోకుండా ఉండలేరు. ఎంతో దీక్ష, పట్టుదల ఉంటే కానీ ఇది సాధ్యం కాదని మీరు అంటారు. అవును, 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ యంగ్ అండ్ డైనమిక్ యువ క్రికెటర్.. 2021 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రాత్రికి రాత్రి హీరో అయిపోయిన సంగతి విదితమే.

అయితే దాని వెనకాల సుందర్ దీర్ఘకాల అకుంఠిత దీక్ష ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఆ సిరీస్ లో సుందర్ సంచలన ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా అందరి చూపులు ఆటగాడివైపు మళ్ళాయి. సదరు మ్యాచ్లో సుందర్ చేసిన హాఫ్ సెంచరీ.. తీసిన స్టీవ్ స్మిత్ వికెట్ అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తాజాగా న్యూజిలాండ్ సిరీస్-2023లో భాగంగా జరిగిన తొలి టీ20లో బౌలింగ్లో 2 వికెట్లు, బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీతో సుందర్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

సుందర్ కేవలం ఒక్క చెవితో మాత్రమే వినగలడని మీలో ఎంతమందికి తెలుసు? వినికిడి లోపం ఉన్నప్పటికీ.. ఏమాత్రం తడబడని అతని ఆటతీరుని చూసి దిగ్గజ ఆటగాళ్లు సైతం జయహో సుందర్ అని అంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమంటే, వాషింగ్టన్ సుందర్ అనగానే అతను క్రిస్టియన్ అని అందరూ భ్రమ పడతారు. అయితే అతను సంప్రదాయ తమిళ హిందు కుటుంబానికి చెందిన వాడే. మరి సుందర్ కి వాషింగ్టన్ అనే పేరును ఎందుకు చేర్చారో తెలుసా? సుందర్ చిన్నతనంలో కుటుంబం ఆర్ధిక సమస్యలతో తలకిందులైనపుడు PD వాషింగ్టన్ అనే ఓ సైనికుడు తమను అన్ని విధాల ఆదుకున్నాడట ఆ కృతజ్ఞతతోనే సుందర్ తల్లిదండ్రులు ఆ పేరుని సుందర్ పేరుకి జోడించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: