ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రేపు భారత జట్టు రెండవ టెస్టు మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే . అయితే ఇప్పటికే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి జోరు మీద ఉన్న టీమిండియా జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్ లో కూడా గెలవడమే లక్ష్యంగా బలిలోకి దిగబోతుంది అని చెప్పాలి. అయితే అటు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో ఇప్పటివరకు టీం ఇండియా ఆడిన అన్ని మ్యాచులలో కూడా ఘనవిజయాన్ని సాధించింది.. ప్రత్యర్థులని చిత్తుగా ఓడించింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియాదే విజయం అని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


 ఇదిలా ఉంటే.. మొదటి టెస్ట్ మ్యాచ్ కు వెన్నునొప్పి గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఇక రెండవ టెస్టు మ్యాచ్ కు మాత్రం అందుబాటులోకి వస్తాడు అన్నది తెలుస్తుంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్న అతను ఇటీవల పూర్తిగా కోలుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. అయితే అతను రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టులోకి రావడం ఖాయం అన్నది మాత్రం ప్రస్తుతం తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి రావడం పై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ ఐదు రోజులపాటు ఆడగలిగే పరిస్థితిలో ఉంటేనే తుది జట్టులోకి వస్తాడు అంటూ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.  ఏ ఆటగాడు అయినా గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి రావడం సంతోషాన్ని ఇచ్చే విషయమే. గాయాల వల్ల ఆటగాళ్లని కోలుకోవడం మాకు ఎప్పుడు ఇష్టం ఉండదు అంటూ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఆడే విషయంపై కొన్ని ప్రాక్టీస్ సెషన్ ల తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇటీవలే కాసేపు ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఇక ఆ తర్వాత అతడు ఫిట్నెస్ అంచనా వేసి తుది జట్టులోకి తీసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: