టీమిండియాలోకి బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా ఎంట్రీ ఇచ్చాడు అక్షర్ పటేల్. అయితే బ్యాటింగ్ ఆల్ రౌండర్ అని పేరుకు మాట్లాడుకోవడమే తప్ప అతను బ్యాటింగ్తో ఇప్పటివరకు టీమిండియా తరఫున మంచి ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు దాదాపు లేవు అని చెప్పాలి. ఇక బౌలింగ్లో అప్పుడప్పుడు మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ బ్యాటింగ్లో మాత్రం ఎప్పుడూ అంచనాలను అందుకోలేక నిరాశ పరుస్తూ వస్తూ ఉండేవాడు. కానీ ఇటీవల టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కోరుకునే సమయంలో అక్షర్ పటేల్ తన బ్యాటింగ్ టాలెంట్ తో ఇక జట్టును ఆదుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 మొదటి టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లో కూడా అద్భుతంగా రానించిన టీమిండియా జట్టు అటు రెండవ టెస్టు మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో మాత్రం తడబాటుకు గురైంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియోన్ స్పిన్ దెబ్బకు టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇక 139 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అటు క్రీజులో ఉన్న అక్షర్ పటేల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 115 బంతుల్లో మూడు సిక్సర్లు ఐదు ఫోర్లతో 74 పరుగులు చేశాడు. మరోవైపు అతనికి అశ్విన్ నుంచి మంచి సహకారం అందింది.


 ఒకవేళ అక్షర్ పటేల్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే అటు పరుగుల విషయంలో ఆస్ట్రేలియాతో పోల్చి చూస్తే టీమిండియా ఎంతగానో వెనుకబడి పోయేది అని చెప్పాలి. అయితే ఇక ఇలా రెండవ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో మంచి బ్యాటింగ్ చేయడంపై అక్షర్ పటేల్ స్పందించాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ ఇంతలా మెరుగుపడటంలో రికీ పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు అంటూ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడు చాలా విషయాలను నేర్చుకున్నాను అంటూ తెలిపాడు. జట్టు కోసం 100% ఎఫర్ట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని.. రాబోయే మ్యాచ్ల్లో కూడా ఇదే తీరు ఆట కొనసాగిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: