
ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్లో కరాచీ కింగ్స్ జట్టు ఓడిపోవడంతో పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ అయిన వసీం జాఫర్ తన కంట్రోల్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే గట్టిగా అరుస్తూ తన ముందు ఉన్న సోఫాను తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా ఇటీవల ముల్తాన్ సుల్తాన్... కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ అధ్యక్షుడిగా ఉన్నాడు మాజీ ప్లేయర్ వసీం అక్రమ్. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది అని చెప్పాలి.
ఇక ఈ మ్యాచ్ లో కరాచీ కింగ్స్ ను ఓడించిన ముల్తాన్ సుల్తాన్ విజయం సాధించింది. అయితే ఇలా చివరి వరకు పోరాడి కరాచీ కింగ్స్ ఓడిపోవడం ఈ సీజన్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. ఓవరాల్ గా నాలుగు పరాజయాలను చవిచూసింది. అయితే ఈ ఓటమి తట్టుకోలేక పోయిన వసీం అక్రమ్ కంట్రోల్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే తన ముందు ఉన్న కుర్చీలను సోఫాలను గట్టిగా తన్నాడు. దీంతో అవి ఎగిరి పడ్డాయి అని చెప్పాలి. ఇక ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోవడంతో క్రీడా స్ఫూర్తి అంటే ఇదేనా అని ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు.