
కొత్త బౌలర్ మాథ్యూ కునేమాన్ దెబ్బకు కేవలం 109 పరుగులకు ఆల్ ఔట్ అయింది. మూకుమ్మడిగా అందరూ ఔట్ అవ్వడమే ఇంత దారుణ వైఫల్యానికి కారణం అని చెప్పాలి. అయితే బ్యాటింగ్ లో ఫెయిల్ అయినా ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్ లో 197 పరుగులకు కట్టడి చేసి కాస్త మ్యాచ్ పై నమ్మకాన్ని కలిగించారు. కానీ రెండవ ఇన్నింగ్స్ లోనూ ఇండియా ఆటగాళ్ళు అదే ఆటతీరును కనబరిచి మొదటి ఇన్నింగ్స్ కన్నా మరో 54 పరుగులు ఎక్కువగా జోడించి 163 పరుగులకు ఆల్ ఔట్ అయింది. ఈ స్కోర్ లో పుజారా ఒక్కడే 59 పరుగులు చేసి ఇండియాకు ఆ మాత్రం స్కోర్ అయినా రావడంలో సహాయపడ్డాడు.
ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఇండియాను ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ నాథన్ లయాన్ గడగడలాడించాడు. ఏకంగా ఇతను పది వికెట్లలో 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా రెండు ఇన్నింగ్స్ ల అనంతరం ఇండియా కేవలం 75 పరుగులు లీడ్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఈ టెస్ట్ లో ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా 76 పరుగులు చేస్తే మూడవ టెస్ట్ ను కైవసం చేసుకుంటుంది. మరి కాసేపట్లో మొదలు కానున్న మూడవ రోజు మొదటి సెషన్ లో ఇండియా బౌలర్లు రాణిస్తే ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయా ? లేదా మూడవ టెస్ట్ ను ఆస్ట్రేలియాకు అప్పగిస్తారా అన్నది తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.