2023 ఐపీఎల్ సీజన్లో టైటిల్ కొట్టడమే లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగెందుకు సిద్ధమైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ కోసం ఇప్పటికే చెన్నై క్యాంపుకు చేరుకున్న మహేంద్రసింగ్ ధోని ప్రత్యర్ధులను ఎదుర్కునేందుకు వ్యూహాలను రచించే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక ప్రాక్టీస్ లో కూడా మునిగితేలుతూ ఉన్నాడు. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ధోని కెరియర్ లో చివరి ఐపీఎల్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇటీవల భారీ ధర పెట్టి జట్టులోకి తీసుకున్న బెన్ స్టోక్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాధ్యతలు అప్పగించే  ఛాన్స్ ఉంది అంటూ ఒక   టాక్ చక్కర్లు కొడుతుంది.


 ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. తమ జట్టు ఆటగాళ్లు ఏం చేస్తున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్లు ఇస్తూనే ఉంది అని చెప్పాలి. ఎన్నో ఆసక్తికర వీడియోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంది. ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు సిబ్బంది అందరూ కలిసి ఇక వేడుకల్లో మునిగి తేలారు అని చెప్పాలి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోగా అటు ధోని మాత్రం ఒక్క రంగు మరక లేకుండానే తప్పించుకున్నాడు. మైదానంలోనే కాదు ఇక్కడ కూడా ధోని మాస్టర్ మైండ్ ఉపయోగించాడు అన్నది తెలుస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో చూసుకుంటే.. చెన్నై జట్టులోని ఆటగాళ్లు సిబ్బంది అందరూ కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇంతలోనే ధోని మాత్రం కనీసం ఒక్క చుక్క రంగు కూడా లేకుండా రాయల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ ధోని హోలీలో కూడా మాస్టర్ మైండ్ గేమ్ ఆడి రంగులు పడకుండా తప్పించుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: